ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 18 మంగళవారం
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నాకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీమ్ వల్ల మా మూడేళ్ల చదువు వృథా అవుతుందని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.ఇప్పుడు తాము ఇంజినీరింగ్ చేయాలంటే మళ్లీ ఇంటర్ చేసి రావాలా..? అని రేవంత్ సర్కారును ప్రశ్నించారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో GO 97ని తీసుకొచ్చి డిప్లొమా కోర్సులను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానం చేయడంవల్ల డిప్లొమా విద్య ప్రాధాన్యత తగ్గుతుందని విద్యార్థులు అంటున్నారు.జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని వికారాబాద్ పట్టణంలో కూడా పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వ స్కీమ్ వల్ల సాంకేతిక విద్యా మండలి స్వతంత్రత దెబ్బతింటుందని, డిప్లొమాను సాధారణ శ్రామిక శిక్షణగా మారుస్తున్నారని ప్రభుత్వం విడుదల చేసిన ఈ GO ను రద్దు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. అసలు ఎవరిని అడిగి ఈ స్కీమ్ తెచ్చారు రేవంత్ రెడ్డి గారు..? అని విద్యార్థులు నిలదీస్తున్నారు.
రేవంత్ రెడ్డి తెచ్చిన శక్తి స్కీమ్ వల్ల డిప్లొమా విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెస్తే తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అంటున్నారు.















