EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మైక్రో ఇండస్ట్రీస్ కమిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ను ప్రారంబించిన ఎంపీ ఈటల రాజేందర్

హైదరాబాద్ అక్టోబర్ 9 (ఈతరం భారతం);మేడ్చల్ మండలం, రావల్కోలేలో గీత నగర్, నవ జీవన్ నగర్ మైక్రో ఇండస్ట్రీస్ కమిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ను మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైన ఆరాటపడుతుంది ఎంప్లాయిమెంట్ జనరేషన్ కోసం.గతంలో కేంద్ర ప్రభుత్వ పరంగా ఎప్పుడూ కూడా సపోర్టివ్ స్కీమ్స్ ఉండేవి లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా స్కీమ్ పెడితే దానికి సపోర్ట్ గా ఉంది తప్ప నేరుగా కేంద్ర ప్రభుత్వం ఏ స్కీమ్ పెట్టలేదు. మోడీ గారు పేదరికం నుండి వచ్చిన వ్యక్తి కాబట్టి అనేక రకాల స్కీములు పెట్టారు.ప్రభుత్వపరంగా, ప్రైవేటుపరంగా ఎంప్లాయిమెంట్ జనరేషన్ కోసం 4 లక్షల కోట్ల రూపాయలను 2024-25 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం పెట్టిందన్నారు. భూలోకంలో అత్యధికంగా యువశక్తి కలిగిన దేశం భారతదేశం. ఏ రంగంలోనైనా యువశక్తిని ఇన్వాల్వ్ చెయ్యకపోతే రాష్ట్రమైన, దేశంమైన పురోగమించే ఆస్కారం లేదు. 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ నేడు మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. యధా రాజా తథా ప్రజా అంటారు. దేశం నడిపే పాలకులు ఎలా ఉంటే దేశం అలా ఉంటది కాబట్టి మన పాలకులకు కమిట్మెంట్, తపన ఉందన్నారు.. మన దేశం త్వరలోనే మొదట ఆర్థిక వ్యవస్థగా నిర్వాలని కోరుకుంటున్నాను.ఈ ప్రాంతంలో మీ ఇండస్ట్రీస్ గొప్పగా ఎదగాలని, మరింత ముందుకు పోవడంలో మా పాత్ర కూడా ఉంటుందని మనవి చేస్తూ మీకు శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎంఎస్ఎంఈ E జేడీ శివ శేషగిరి రావు, గోపాల్, ఉపేందర్ రెడ్డి, శ్రీనివాస్ రావు, నరేంద్ర చారి, విక్రమ్ రెడ్డి, బుద్ది శ్రీనివాస్, రాజి రెడ్డి, సతీష్ సాగర్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top