ఈ తరం భారతంహైదరాబాద్ నవంబర్ 19
రంగా రెడ్డి జిల్లాలో ఇంతకాలం ఎవ్వరికి వారే యమున తీరు గా ఉన్నా నాయకులు ఇప్పుడు ఐక్యరాగం ఆలపిస్తున్నారు. రంగా రెడ్డి జిల్లాకు సంబంధం లేని సీసాల రాజి రెడ్డి నీ, జిల్లా అధ్యక్షుడిగా ఖరారు చేస్తారనే ప్రచార నేపథ్యములో జిల్లా నాయకులు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల మీద భగ్గు మంటున్నారు. ఇప్పటికీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షా పదవి కోసం, వేణు గోపాల్, దేపా భాస్కర్ రెడ్డి, కొత్త కురమ శివ కుమార్, బొక్క చెన్న రెడ్డి, బడంగ్ పేట్ మున్సి్పల్ నగర పాలక మాజీ మేయర్ చిరి గింత పారిజాత రెడ్డి వంటి స్థానికులు పోటీలు పడుతుంటే జిల్లాకు సంబంధం లేని రాజి రెడ్డి నీ ఏలా సిపార్స్ చేస్తారని జిల్లా అధ్యక్షులు, పి సిసి ప్రసిడెంట్ ను నిలతీస్తున్నారు. ఈ మేరకు జిల్లా నాయకులు రాజి రెడ్డి నియామమకాని విభేదిస్తూ సంతకాలతో కూడిన పిర్యాదు పత్రాన్ని అధిష్టాననికి పంపినట్లు తెలుస్తుంది. రాజిరెడ్డి అభ్యర్థిత్వాని ఏఐసీసీ లోని కీలక సభ్యుడు వ్యతిరేకించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యములో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకొని రాజి రెడ్డి నియామమా కాని తాత్కాలింగా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇంతకు ఎవ్వరు రాజి రెడ్డి… జనగాం జిల్లాకు చెందిన రాజి రెడ్డి గతములో ఎల్ బి నగర్ నియోజక వర్గం కొత్త పేట డివిజన్ నుండి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కు పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. కానీసం అప్పటినుండి ఐనా జిల్లా నాయకులతో సంభందాలు లేవ్వు. ఓటర్ ఐడి, ఆధార్ వంటివి జనగాం నియోజక వర్గములో వున్నావి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం అసెంబ్లీ టికెట్ ప్రయత్నం చేసిన వ్యక్తి రంగా రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎలా నియమామకం చేస్తారాని అధిష్టాన్ని ప్రశ్నిస్తున్నారు.















