ఈతరం భారతం హైద్రాబాద్ ఏప్రిల్ 9;
రాష్ట్రంలో భూకబ్జాలు – అవినీతి విచ్చలవిడిగా హద్దు పద్దు లేకుండా పెరిగిపోయింది. దీనిని అరికట్టవలసిన ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. పైగా ప్రభుత్వ అధినేతలే అక్రమాలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై టిఆర్ఎస్ నేతలు – టిఆర్ఎస్ నేతలపై మంత్రులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ నాయకులు ముఖ్యంగా పదవులలో ఉన్న మంత్రులు, శాసనసభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల అక్రమాస్తులపై వారి హయంలో జరిగిన అధికారం దుర్వినియోగం – అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇంత అవినీతి జరుగుతున్న కొందరు మంత్రులు కొందరు అధికారులు వేల లక్షల కోట్లు అక్రమా ఆస్తులు సంపాదిస్తున్న రాజకీయ పార్టీలు – ప్రతిపక్షలు ప్రత్యేక్ష పాత్ర పోషిస్తున్నారు తప్ప దీనిపై సమగ్ర విచారణ జరపాలని కోరడంలేదు. అందుకే త్వరలో ప్రధానమంత్రిని కలిసి సిబిఐ విచారణ కోరన్నట్లు కృష్ణయ్య తెలిపారు. ఇంత అవినీతి పాలన అక్రమ పాలన ప్రజలను పట్టించుకొని ప్రభుత్వాలను నా 50 సంవత్సరాల ఉద్యమ కాలంలో చూడలేదన్నారు.
ప్రస్తుత ప్రభుత్వంలో నలుగురు మంత్రులు, కొందరు ఐఏఎస్ అధికారులు కలెక్టర్లు కుమ్మక్కై రాష్ట్రాన్ని లూటి చేస్తున్నారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమ గాలికి వదిలేసారు. గత 13 సంవత్సరాల లో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలి. ధనిక రాష్ట్రం – మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం నేడు 10 లక్షల కోట్లకు పైగా అప్పుల పాలయింది. విచిత్ర ఏమిటంటే ఈ దోపిడీ దొంగలు భూమి ఆస్తులు కాజేయడమే గాక తెచ్చిన అప్పులతో కూడా కాంట్రాక్టర్ల పేరు మీద కోట్లు కొల్లగడుగుతున్నారన్నారు. రాష్ట్రాన్ని అదోగతి పాల్జేశారు. ప్రజల అభివృద్ధి – సంక్షేమాన్ని గాలికి వదిలేశారు.విద్యార్ధులకు ఫీజులు – స్కాలర్ షిప్ లు ఇవ్వడం లేదు. అంతేకాదు బి.సి హాస్టళ్ళు – గురుకులాలకు స్వంత భవనాలు నిర్మించడం లేదు.
ప్రభుత్వ స్థలాలు – ప్రజల ఆస్తులు వీటిని ప్రజా అవసరాలకు, పేదల ఇండ్లు కట్టడానికి ప్రభుత్వ ఆఫీసులకు హాస్టళ్ళకు, స్కూల్ కు నిర్మాణానికి ఉపయోగించాలి. అంతే గాని కబ్జాలు చేయడానికి అమ్మడానికి కాదు. ఇప్పుడు అమ్మితే కబ్జాలు భావితరాలకు ఏమి ఉంటుందని ప్రశించారు. గతంలో కూడా ప్రభుత్వాలు అమ్మడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు మేము గట్టిగా వ్యతిరేకించడంతో అమ్మడాని ఆపేశారు. ఇప్పుడు కూడా ప్రభుత్వ భూమి అమ్మడం ఆపేయాలి. ప్రభుత్వ స్థలాలను వేలం వేయరాదు. ఇది బీసీ కాలేజీ హాస్టళ్ళు, బీసీ గురుకుల పాఠశాలకు సొంత భవనాలు నిర్మించడానికి ఇళ్ళు లేని పేదలకు పంచడానికి, అడవులు పెంచడానికి వాతావరణం కాలుష్యం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది బీసీ/ఎస్‌సి/ఎస్‌టి కాలేజీ హాస్టళ్ళు, బీసీ గురుకుల పాఠశాలకు సొంత భవనాలు, నిర్మించాలని డిమాండ్ చేశారు. అద్దె భవనాలలో చాలీ-చాలని వసతులతో విద్యార్థులు కిక్కిరిసి యున్నారు. హాస్టల్ గదులు కిక్కిరిసిపోయాయి. 5మంది విద్యార్ధులు యుండవలసిన గదులలో 20 నుంచి 30 మంది ఉంటున్నారు. కొత్త బిల్డింగులు తీసుకోవడం లేదు. ఒకే భవనంలో ౩ హాస్టళ్ళను నడుపుతున్నారు. విద్యార్ధుల సౌకర్యం కల్పించాలనే కోణంలో చూడకుండ ప్రభుత్వానికి డబ్బు ఎలా మిగిల్చాలని అధికారులు చూస్తున్నారు. దీని వలన విద్యార్థులు ఆరోగ్యం దెబ్బతింటుంది. చదువు దెబ్బతింటుంది. జాతి సంపద దెబ్బ తింటుంది. పైగా ఏటా అద్దె కింద కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. కావున అన్ని వసతులతో స్వంత భవనాలు నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు పంచాలని కోరారు. హాస్టళ్లకు, గురుకులాలకు ఇచ్చిన తరువాత అమ్మకాలకు పోవాలన్నారు. ఇంకొక వైపు నగరాలలో చెట్లు పెంపకం లేక వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. కబ్జా దారుల నుండి భూములను కాపాడుకోవాల్సిన అవసరంయుంది.
ఒకవైపు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించకుండా ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం ప్రభుత్వ స్థలాలను వేలం వేస్తూ మంత్రులు కబ్జా దొరలకు వందల కోట్ల రూపాయలకు అమ్ముకుంటూ ఉన్నారు. ప్రభుత్వ స్థలాలు ఇల్లు లేని పేద ప్రజలకు కేటాయించాలి. కానీ వేలం వేయడం – అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వ స్థలాలు అమ్మ రాదని వ్యతిరేకిస్తూ ప్రజలందరూ తిరుగుబాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కొందరు రెవెన్యు అధికారులు పేద ప్రజలకు ఇళ్ళ స్థలాలు కేటాయించి రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కయి. కోట్ల రూపాయలు అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారన్నారు. త్వరలో ప్రధానమంత్రిని సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ మహానగరంలో 6 లక్షల మంది పేద ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన చెందిన పేద ప్రజలు ఇంటి అద్దాలు చెల్లించలేక బ్రతుకు భారమై జీవిస్తుంటే ప్రజాపాలన పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు అమ్ముకుంటూ రాష్ట్రాన్ని దోపిడి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.















