ఈతరం భారతం/హైదరాబాద్ /నవంబర్ 5:
రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేసే కుట్ర జరుగుతుందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. బుధవారం హైదరాబాద్, బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ..ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా , ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ పథకాన్ని తీసుకొచ్చారని ఆర్ కృష్ణయ్య గుర్తు చేశారు. ఎస్సీ , ఎస్టీ, బీసీ మైనార్టీలు ఫీజు రియంబర్స్మెంట్ పధకం ద్వారా ఉన్నత చదువులు చదివి , గొప్పస్థాయిలో స్థిరపడ్డారని తెలిపారు. కాంట్రాక్టర్లకు వేల కోట్లు విడుదల చేస్తున్న ప్రభుత్వానికి , విద్యార్థుల భవిష్యత్ కనిపించడం లేదా అని ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయకుండా కాలయాపనకే ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసిందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకుండా ప్రభుత్వం సమస్యను పక్కదారి పట్టించడానికి విజిలెన్స్ దాడులు చేపిస్తోందని కృష్ణయ్య ఆరోపించారు. ఫీజుల సమస్యలను చర్చించడానికి వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మార్చుకొని , పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరారు. లేనిపక్షంలో ప్రజా వ్యతిరేకతను చవిచుదవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశం లో బీసీ సంఘం నేతలు మణికంఠ, రాజు నేత, రాజేందర్, అనంతయ్య, మోడీ రాం దేవ్, బాలయ్య, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.















