హైద్రాబాద్ ఆగస్ట్ 25 (ఈతరం భారతం)స్థానిక సంస్థల ఎన్నికలలో చట్టబద్ధత కూడిన రిజర్వేషన్ల సాధనకై ఇందిర పార్కులో సత్యాగ్రహ దీక్ష చేపట్టిన బీ సి దళపతి ఆర్ కృష్ణ య్య దీక్షకు బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ సంఘీభావాన్ని ప్రకటించారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి బీసీ జాగృతి సేన సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ బీసీలకు పార్టీపరంగా స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలను దగా చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీపరమైన రిజర్వేషన్లు మీ కార్యకర్తలకు ఇచ్చు కోండి బీసీలకు కావాల్సింది చట్టబద్ధత తో కూడిన 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికల ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల నుండి బీసీలకు సీట్ల కేటాయింపులో పూటకో మాట మాట్లాడుతూ బీసీలను రాజకీయంగా అంచి వేయడానికి ప్రయత్నిస్తున్నారని, బీసీలపై పన్నే కుట్రలను తిప్పి కొట్టడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.బిజెపి,బీఆర్ఎస్ పార్టీలు బీసీ రిజర్వేషన్ల పెంపుకై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, లేకుంటే బీసీలను ఓట్లు అడిగే హక్కును కోల్పోతారని హెచ్చరించారు.కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయకుంటే బీసీ జాగృతి సేన ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోరజక సంఘం జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్, బీసీ జాగృతి సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటేష్ యాదవ్,బీసీ రక్షక దళం రాష్ట్ర అధ్యక్షులు జక్క క్క చంద్రమోహన్, బొల్లెమోని నిరంజన్,గొడుగు నరసింహులు, సురభి విజయ్ కుమార్, కోటకొండ కురుమయ్య, లింగంపేట శేఖర్, గణేష్, నాగేష్, చెన్నయ్య,బాబు తదితరులు పాల్గొన్నారు.















