ఈతరం భారతం/హైదరాబాద్ /నవంబర్ 6:
రేపటి మంత్రి వర్గ సమావేశంలో స్థానిక సంస్థలలో బి.సిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో చట్టబద్దంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవాలి. పార్టీ పరంగా ఒప్పుకోనేదే లేదని తెలంగాణా బి.సి జాక్ చైర్మన్, రాజ్యసభ సభ్యులు ఆర్, కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషన్లను 42 శాతం కు పెందాలని డిమాండ్ చేస్తూ బీసీ జాక్ ఇచ్చిన పిలుపుమేరకు ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు చేయగా నేడు తెలంగాణ బీసీ జాక్ అధ్యకులు ఆర్. కృష్ణయ్య విద్యార్ధుల పళ్ళ రసం ఇచ్చి విరమణ చేసారు.జనాభా ప్రకారం విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థల రిజర్వేషన్లకు కల్పించే సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడానికి రాజ్యాంగ సవరణ జరగాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయముకు రావాలని విజ్ఞప్తి చేశారు.
స్థానిక సంస్థల రిజర్వేషన్లు విషయంలో మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, మద్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా బీసీలకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. కానీ ఆ రాష్ట్రాలలో బీసీలు తిరగబడలేదు. కానీ మన రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల రక్షణ కోసం రాష్ట్ర బందీ జరపడం గర్వించదగిందని అన్నారు. ఇది మన రాష్ట్రంలోని బీసీల చైతన్యానికి ప్రతీక అన్నారు.
గత నెల 18న జరిగిన బంద్ తో నైనా ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన సంస్థలు కళ్ళు తెరవాలని, బీసీల వాటా బీసీలకు ఇవ్వడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బీసీలలో చైతన్యం వచ్చింది. పోరాట ప్రతిభ పెరిగింది ఇప్పుడు సాదించకపోతే ఇంకా ఎప్పుడు సాధించమని హెచ్చరించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-D6 ప్రకారం స్థానిక సంస్థలోని బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ అధికారం ఇచ్చింది కావున అసెంబ్లీ చట్టం చేశారు జీవో తీసి వెంటనే ఎన్నికలు జరపవచ్చు ఏమైనా న్యాయపరమైన సమస్యలు వస్తే సుప్రీంకోర్టుకు ఏ కోర్టుకు ఎవరైనా వెళ్లిన బీసీల, కేసులు గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే జనాభా లెక్కలు ఉన్నవి అసెంబ్లీ చట్టం చేశారు అలాగే సుప్రీంకోర్టు అగ్ర కులకు 10శాత్తం రిజర్వేషన్లు పెట్టినప్పుడు కేసులో 50% సీలింగ్ ఎత్తివేసింది. పైగా ఇందిరా సహానీ కేసులో ఎంఎరికల్ డాటా ఉంటే 50% సీలింగ్ ను అధిగమించవచ్చునని సుప్రీం కోర్టు అభిప్రాయం కూడా ఉన్నది. ఇప్పుడు అన్ని కోణాల్లో చూస్తే కేసు గెలిచే అవకాశం ఉంది. చట్ట ప్రకారము, న్యాయప్రకారము రాజ్యాంగపరమైన అవరోధాలు లేవు కావున సుప్రీంకోర్టులో కేసు గెలుస్తుంది. ఎందుకంటే రిజర్వేషన్లు పెంచడానికి న్యాయపరమైన చట్టపరమైన రాజ్యాంగపరమైన అవరోదాలు ఏమీ లేవు కేసు బలంగాయుంది. రిజర్వేషన్లు పెంచడానికి కులాల వారిగా లెక్కలు తీశారు. అసెంబ్లీలో చట్టం చేశారన్నారు.
ఈ దీక్షలలో కాంతి దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు పృధ్వి రాజ్ యాదవ్, జాతీయ బి.సి సంక్షేమ సంఘం కో అర్డినేటర్ డా.ర్యాగ అరుణ్ కుమార్, గుజ్జ సత్యం, దాసు సురేష్, జంపాల రాజేష్, కొమ్మనబోయిన సైదులు, చీరాల వంశి, మామిడాల రవి, బారి అశోక్ కుమార్, నూకల మధు యాదవ్, కోలా రాజశేఖర్, మూర్తి వెంకట్, సంతోష్, అశ్విని, శ్రీధర్, ఉదయ, అజయ్ తదితరులు పాల్గొన్నారు.















