EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

విద్యార్ధులకు ఓటు హక్కు లేదు అని చిన్న చూపు తగదు  వారు రేపటి బావి భారత పౌరులు  తెలంగాణా ప్రభుత్వం తక్షణమే సగమేనా ఫీజుల బకాయిలు చెల్లించాలి

ఈతరం భారతం/హైదరాబాద్ /నవంబర్ 4 :

రేపటి బావి భారత పౌరులయిన విద్యార్ధులకు ఓటు హక్కు లేదు అని చిన్న చూపు తగదని తెలుగు రాష్ట్రాల యువత అధ్యక్షులు, దక్షిణ మద్య రైల్వే సభ్యులు కాలపురెడ్డి సాయిబాబా అన్నారు.విద్యానగర్ లోని బిసి భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే సగమేనా ఫీజుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసారు. ప్రేవేట్ కాలేజి యాజమాన్యం నేటి నుండి చేస్తున్న బంద్ ను విద్యార్ధుల పరీక్షలను మరియు భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని విరమించుకోవాలని కాలేజి యాజమాన్యానికి విజ్ఞప్తి చేసారు.మొన్న అందరి బిల్లు చెల్లించమని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క చెప్పారు. కాంట్రాక్టులకు వేరే వేరే వారుకి చెల్లిస్తారు కాను విద్యార్ధుల బిల్లులు చేల్లిన్చారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ ఫీజ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు అష్ట కష్టాల పాలవుతున్నారు. ఈ ఫీజులు కట్టాలని కాలేజీ విద్యార్థులపై యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నారు కోర్సు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు వచ్చినవారికి అప్పులు చేసి ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. సర్టిఫికెట్లు తెసుకోలేక కొందరు ఉద్యోగాలు కోల్పోతున్నారు. పీజీ కోర్సులలో సీట్లు పొందిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఉద్యోగాలు పొందిన వారు ఇతర దేశాలలో ఉద్యోగాలు వచ్చిన వారికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీనితో ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. విదేశాలకు చదువుకోవడానికి సీట్లు వచ్చిన వారికి కూడా సర్టిఫికెట్లు లేక వెళ్లలేకపోతున్నారు.ఇక కాలేజీ యాజమాన్యాలు కష్టాలు కూడా చెప్పతరం కాదు అద్దె భవనాల అద్దె కట్టడం లేదు. కాలేజీ లెక్చరర్ల జీతాలు నెలల తరబడి ఇవ్వక ఇబ్బందులు పడుతున్నారు లెక్చరర్లు, జీతాలు రాక కుటుంబాలు పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నారన్నారు.

Related News

Select the Topic
Scroll to Top