ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 25
తెలంగాణ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో సర్పంచ్లగా ఎన్నికైన వారికి సంక్రాంతి తర్వాత పల్లెల్లో పాలన, నిధుల వినియోగం, అభివృద్ధి, గ్రామసభల నిర్వహణ తదితరాలపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. జిల్లాల వారీగా ఒక్కో బ్యాచ్లో 50 నుంచి 100 మంది ఉండేలా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సర్పంచులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం జరిగిన తర్వాతే ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది.















