ఈతరం భారతంహైదరాబాద్ అక్టోబర్ 7 :భారతదేశంలో సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం, ఓటు-బ్యాంక్ రాజకీయాలు చేయడం, సొంతపబ్బం గడుపుకోవడం కోసం, కాంగ్రెస్ పార్టీ, ఇండీ అలయన్స్ లోని ఇతర రాజకీయ పార్టీలు చేస్తున్న కుట్రలు గా బిజెపి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ అభివర్ణించారు. బిజెపి పార్టీ రాష్ట్ర కార్యాలయం లో మీడియా సమావేశంలో గత ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ రెడ్ పుస్తకాన్ని పట్టుకొని, రాజ్యాంగం విషయంలో భారతీయ జనతా పార్టీ మరియు ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తూ తప్పుడు ప్రచారం చేసినప్పటికీ, ప్రజలు ఆయనను నమ్మలేదు. ఫలితంగా ప్రజల మద్దతుతో మూడోసారి భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో అధికారంలోకి వచ్చిందన్నారు.ప్రస్తుతం బీహార్‌లో గాని, తెలంగాణలో ఉపఎన్నికల సందర్భంలో గాని, కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నారని మోసపెట్టే నాటకాలు చేస్తున్నదని ప్రజలు దీన్ని గమనించాలన్నారు..కాంగ్రెస్ నాయకులు నిత్యం బీజేపీ నేతలను విమర్శించడమే తమ ధ్యేయంగా పెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి , కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ , రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పై ఇష్టానుసారంగా, అవహేళన చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.ఒక రాజకీయ పార్టీలో మంత్రి పదవిని పొందిన పొన్నం ప్రభాకర్ వంటి నాయకులు దిగజారి మాట్లాడటం తగదని హితవు పలికారు.. మొన్నటికి మోన్న సొంత మంత్రివర్గంలోని మాదిగ సమాజానికి చెందిన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారిపై పొన్నం ప్రభాకర్ కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం సమాజం చూసింది. కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ అహంకారపు వ్యాఖ్యలను తీవ్రంగా కుమార్ తీవ్రంగా ఖందించారు..అధికారం వస్తే ప్రజలకు సేవ చేయాలి. నాయకులపై కుల ఆధారిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంపై నమ్మకమున్న నేతలు అందరినీ గౌరవించాలని మేము హెచ్చరిస్తున్నాం.ఒకవైపు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దిగజారింది. గల్లపెట్టెలో పైసలేమి తెలిసి కూడా, సుప్రీం కోర్టులో కేసులు పెట్టే ప్రయత్నాలు, నాటకాలు చేస్తున్నారు. సాధారణంగా సుప్రీం కోర్టులో విచారణను న్యాయవాదులు చూస్తారు, లేదంటే లీగల్ టీమ్ చూసుకుంటుంది. కానీ బీసీ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఉపముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు, కాంగ్రెస్ నాయకులు తామేదో ఉద్దరించేందుకు వెళ్తున్నట్లు ప్రజలను మభ్యపెడుతూ ఢిల్లీ బాట పట్టారు. తామే కోర్టులో వాదించినట్లుగా మాటలు చెప్పడం సిగ్గుచేటు.ఇంకెంతకాలం ప్రజలను మభ్యపెడతారు? ఇంకెంతకాలం బీసీలను, ఎస్సీలను మోసం చేస్తారు? అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రుల్లో ఒకరికొకరిపై గౌరవం లేదు. సమన్వయం కూడా లేదు.ఇటువంటి నాయకులు బిజెపి నాయకులను విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వ్యక్తిగత దూషణలతో ఎవ్వరూ గొప్ప వ్యక్తులు కాలేరు.బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ కోర్టు, ఎన్నికల డ్రామాల ద్వారా అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తోంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుండి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో మద్దతు తెలిపింది. మా ఎమ్మెల్యేలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.కేవలం బీసీ రిజర్వేషన్లలో 42% లో 10% మతాభిప్రాయ ఆధారంగా ముస్లింలను చేర్చడాన్ని మాత్రమే వ్యతిరేకించడం జరిగింది.కాంగ్రెస్ పార్టీకి నిజమైనచిత్తశుద్ధి ఉంటే, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని హెచ్చరిస్తున్నాం.ఈ మీడియా సమావేశంలో బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కాంతికిరణ్, కుమ్మరి శంకర్ తదితరులు పాల్గొన్నారు.















