ఈతరం భారతం హైద్రాబాద్ జూన్30
నితిన్ నబీన్ తెలంగాణ కి వచ్చేపుడు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎంత నిధులు కేటాయిస్తుంది రాష్ట్రం నుండి GST రూపం లో కేంద్రానికి నిధులు ఎంత వస్తున్నాయి తెలుసుకుంటే బావుండేదని టిపిసిసి, ఉపాధ్యక్షులు సంఘీశెట్టి జగదీశ్వరరావు అన్నారు.మంగళవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ కేద్రం ఇచ్చిన హామీలు సంగతి ఏంటి..! బీజేపీ ఎన్నికల ముందు నల్లధనం దేశానికి తెస్తా అన్నారు , పెట్రోల్ ధరలు తగించాం అన్నారు .10 ఏళ్ల అధికారం లో ఉన్నపుడు కాళేశ్వరం లో అవినీతి జరిగింది అన్నారు మరి ఎందుకు కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
సిబిఐ విచారణకి సిఎం కేంద్రానికి లేఖ రాశారు, ఎందుకు కేంద్రం విచారణ జరపలేదు ఇతర రాష్ట్రాల లాగా SIR ని అడ్డం పెట్టుకుని తెలంగాణ లో గెలవలేరు బిజెపి ఆటలు తెలంగాణ లో సాగవు తెలంగాణ ఉద్యమాల గడ్డ అన్నది గుర్తింఛాయాలన్నారు.తెలంగాణ విభజన హామీలు నెరవేర్చని మీరు తెలంగాణ పై మాట్లాడే అర్హత లేదు. నరేంద్ర మోడీ గారి సబ్కా సాత్ , సబ్కా వికాస్, సబ్కా ప్రయస్ ప్రజలకు ఇచ్చిన నినాదం ఇప్పుడు సబ్కా ప్రయాస్, ఆ దాని అంబానీ కే సాత్, ఆర్ఎస్ఎస్ బిజెపి కా వికాస్ తో ముందుకు సాగుతున్నారు.
నితిన్ నవీన్ గారు బిజెపి జాతీయ అధ్యక్షులు, బండి సంజయ్, కిషన్ రెడ్డి గారు తెలంగాణలో పిచ్చి పేలాపనలు చేసేటప్పుడు. తెలంగాణ విభజన హామీలు ఎన్ని నెరవేర్చినారో చెప్తే బాగుంటుంది గురుగింజ కింద ఏముందో తెలియదు అనే చందంగా బిజెపి వాళ్ళ ప్రవర్తన ఉందని తెలియజేస్తున్నారు.నితిన్ నవీన్ గారు బిజెపి ఉల్లంఘించిన హామీలపురం మాట్లాడితే బాగుండేది , 60 ఏళ్లు దాటిన సన్న చిన్న కారు రైతుల నిలపించిన, ప్రతి సామాన్య గృహానికి ఉచితంగా ఫ్రీ విద్యుత్ ఇస్తామన్నారు, 6000 కిసాన్ సన్మానిది పెంచుతామన్నారు , 12 ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వని దుస్థితి మీది కాదా నవీన్ గారు అని ప్రశ్నించారు. పెట్రోల్ 50 రూపాయలకు ఇస్తామన్నారు పెట్రోల్ 115 రూపాయలు చేసిన దోపిడీ గురించి మాట్లాడితే బాగుండేది . మహిళలకు వెన్నుపోటు పొడిచిన మీరు సిలిండర్ 400 రూపాయల నుండి 1200 ఎందుకు చేసిరో చెప్తే బాగుండేది . సబ్కా వికాసం చెప్పే మీరు మధ్యప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో వేలాది ప్రభుత్వ స్కూల్ ఎందుకు మూస్తున్నారో, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ప్రతి ఇంటికి 15 లక్షల రూపాయలు పంచుతామన్నారు
తెలంగాణలో ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు, ఎందుకు ప్రశ్నిస్తున్నారు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నందుకా, రైతు భరోసా ఇస్తున్నందుకా, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, గ్యాస్ సిలిండర్లు ఇచ్చి,ఆర్టీసీ లాభాలు చేకూర్చినందుకా, రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంచినందుకా, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తున్నందుకా, గొప్పవాడు తినే సన్నబియ్యం పేదలకు సన్నబియ్యం ఇచ్చి ప్రతి కుటుంబానికి కొత్త రేషన్ కార్డు ఇచ్చినందుకా, తెలంగాణ అభివృద్ధిలో భాగంగా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేస్తున్నందుకా, మూసీ నది ప్రక్షాళన చేస్తున్నందుకా,నగరంలో చెరువులు కాపాడుతున్నందుకా, మీరు మూసేస్తున్న పేదల స్కూలు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ చేసి ప్రపంచ స్థాయికి విద్యార్థులను తీర్చిదిద్దుతున్నందుకా, యువత డ్రగ్స్ జోలికి పోకుండా ఆటల వైపు ఉండాలని స్పోర్ట్స్ యూనివర్సిటీ పెడుతున్నందుకా, కాంగ్రెస్ పార్టీ స్థాపించిన పబ్లిక్ సెక్టార్లలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు ఎత్తేసే విధంగా బీజేపీ పబ్లిక్ సెక్టర్ కంపెనీలన్నిటిని ప్రైవేటుకి దారదత్వం చేస్తూ రిజర్వేషన్లు ఎత్తేసే కుట్రని పసిగట్టి యువతని స్కిల్స్ వైపు నడిపించి స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నందుకా , దేనికి విమర్శిస్తున్నారు నితిన్ నవీన్ గారు చెప్పాలి అని డిమాండ్ చేశారు.ముందు నిధి నవీన్ గారు బిజెపి నాయకత్వం శ్రీ రాముడికి చేసిన మోసం పైన మాట్లాడాలి.1989 లో శిలానాస్ కి వీ హెచ్ పి బజరంగ్ దళ్ Rs 1400 కోట్లు వసూలు చేసినారు . తర్వాత రాములవారి గుడికి ఆరు సుమారు RS.6000 కోట్ల వరకు వసూలు చేసినారు. ఓటు దొంగతనం,ఈవీఎంల దొంగతనం,మీనాక్షి నటరాజన్ సీట్ దొంగతనం,టిఎంసి శివసేన పార్టీల దొంగతనం, ఇప్పుడు రాముల వారి చెందిన ఆభరణాలు ఉండి దొంగతనం చేస్తున్న బీజేపీ వాళ్లు తెలంగాణ కొచ్చి మాట్లాడే అర్హత లేదు అని చెప్పి జగదీష్ హెచ్చరించినారు.















