EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సీఎం ప్రకటనతోనే మావోయిస్టులు బయటికి వచ్చారు : డీజీపీ

ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 22

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం చేసిన ప్రకటన కారణంగానే మావోయిస్టులు బయటికి వచ్చారని డీజీపీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. ఏ రకంగా బయటికి వచ్చినా మావోయిస్టులను అన్ని విధాలుగా ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. మీడియా ద్వారా వచ్చినా.. ప్రభుత్వ ఉద్యోగులు ద్వారా వచ్చినా.. రాజకీయ నాయకుల ద్వారా వచ్చినా.. మేము స్వాగతిస్తామ‌న్నారు. పార్టీ పరంగా విబేధాలు, ఆరోగ్య కారణాలు, ఇలా అనేక కారణాలతో బయటికి వస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడుగా ఉన్న ఆజాద్ 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నార‌ని పేర్కొన్నారు.

ములుగు జిల్లాకు చెందిన ఆజాద్ మీద 20 లక్షల రివార్డ్ ఉందని.. అప్పాసి నారాయణ మీద 20 లక్షలు రివార్డ్ ఉందని.. మిగతా వారికి 25 వేల రూపాయల నగదు ఇస్తున్నట్లు వెల్ల‌డించారు. కోటి 41 ల‌క్ష‌ల‌ రూపాయల రివార్డ్‌ను 37 మందికి రివార్డ్‌గా ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 11 నెలలో 465 మంది మావోయిస్టులు లొంగిపోయారని.. 59 మంది తెలంగాణకు చెందిన మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని.. ప్రస్తుతం ఐదుగురు కేంద్ర కమిటీలో ఉన్నార‌ని.. 10 మంది స్టేట్ కమిటీ సభ్యులుగా ఉన్నారని వెల్ల‌డించారు.

Related News

Select the Topic
Scroll to Top