ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 22
నల్లకుంట లోని సెయింట్ గ్యాప్రియల్ స్కూల్లో భగవాన్ సత్యసాయి బాబా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు స్కూల్ ప్రిన్సిపాల్ రమేష్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరాయి. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా తనకు చేతనేనంత ఇతరులకు సహకారాలు అందించాలని ఇతరులను బాధ పెట్టవద్దని జీవ హింస చేయవద్దని సత్యసాయి చెప్పిన వాక్కులను ఈ సందర్భంగా గుర్తు చేశారు.సత్యసాయిబాబ బోధనలు లక్షల మందికి మార్గం చూపాయన్నారు. అనంతరం విద్యార్థులందరూ కలిసి సత్యసాయి సూచనలు కలిగిన పేకార్డులు పట్టుకొని ఊరేగింపు జరిపారు.















