EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

స్థానికత కలిగిన హోంగార్డులను స్వరాష్ట్రాలకు బదిలీకి చర్యలు తీసుకోండి    :  బిజెపి తెలంగాణా రాష్ట్ర అద్యక్షులు రామచంద్ర రావుకు హోంగార్డుల వినతి 

ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 10 :

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియమించబడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల స్థానికత కలిగిన హోంగార్డులను స్వరాష్ట్రాలకు బదిలీ చెయించేందుకు తగు చర్యలు తీసుకోవాలని హోంగార్డులు విజ్ఞప్తి చేసారు.ఈ మేరకు బిజెపి తెలంగాణా రాష్ట్ర అద్యక్షులు రామచంద్ర రావును కలిసి వినతి పత్రం, సమర్పించారు. గత 15 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియమితులైన దారావు 400 మంది హోంగార్డులు చాలీ చాలని రోజువారీ వేతనాలతో, కుటుంబాలకు రూరంగా ఉంటూ, తెలంగాణాలో విధులు నిర్వర్తిస్తున్నారని, వీరు ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగియున్నారు. ఇంటర్మీడియటి వరకు వీరి చదువు ఆంధ్రప్రదేశ్ పూర్తి చేశారు. అందువల్ల వీరు తెలంగాణాలో నాన్ లోకల్ గా పరిగణించబడుతున్న కారణంగా తెలంగాణలోని కానిస్టేబుల్ సెలెక్షనో హోంగార్డు ఇచే వెసులుబాటును కోల్పోతున్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ సెలెక్షన్స్లో దరఖాస్తు చేసుకోగా, వీరి సర్వీసు తెలంగాణలో ఉంది గనుక ఆంధ్రలో “కోటా వరించదని చెబుతున్నారు. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాలలో వీరు నష్టపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే రేషన్కారులు, ఇళ్లస్థలాలు, పక్కా గృహాలు వంటి తదితర అన్ని పథకాలు కోల్పోవడమేగాక, వీరి పిల్లల భవిష్యత్తు ప్రశ్నర్థకంగా మారుతోంది. వృద్ధాప్యంలో ఉన్న వీరి తల్లిదండ్రుల బాగోగులు చూసుకోలేక మరింత మానసిక వేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. దయచేసి తెలంగాణాలో పనిచేస్తున్న హోంగార్డులు మనోవేదనను అర్ధం చేసుకుని ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేయవలసిందిగా కోరారు.అలాగే తెలంగాణా రాష్ట్రం స్థానికత కలిగి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 200 మంది హోంగార్డులు పనిచేస్తున్నారు. తెలంగాణా స్థానికత కలిగిన 200 మంది హోంగార్డులను ఆంధ్రప్రదేశ్ కు బదిలీచేసి, ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన 200 మంది హోంగార్డులను తెలంగాణకు బదిలీ చేయడంవలన ప్రభుత్వం మీద ఎటువంటి బడ్జెట్ భారం పడబోదని పేర్కొన్నారు.కావున ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల స్థానికత కలిగిన హోంగార్డులను వారి స్వరాష్ట్రాలకు బదిలీ చేసేందుకు తగు చర్యలు చేపట్టవలసిందిగా విజ్ఞప్తి చేసారు.

Related News

Select the Topic
Scroll to Top