ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 1:
హైదరాబాద్‌లోని అత్యంత విలువైన 9,292 ఎకరాల పారిశ్రామిక భూములను కారుచౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హిల్ట్ పాలసీ–జీఓ నంబెర్ . 27)ని తక్షణమే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు , బిజెఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి నేతృత్వంలో బిజెపి నాయకుల బృందం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కి మెమోరాండం సమర్పించారు. ఈ బృందంలో ఎమ్మెల్సీలు అంజిరెడ్డి గారు, మల్క కొమురయ్య , బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌతం రావు , వీరేందర్ గౌడ్ , వేముల అశోక్ , బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్ , జీహెచ్ఎంసీ బిజెపి ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ , డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రాధా ధీరజ్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు. ee సందర్బంగా రామచంద్ర రావు మాట్లడుతు ఈ పాలసీ ప్రకారం, ఓఆర్ఆర్ పరిధిలోని 22 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ లోని 9,292 ఎకరాల భూమి మల్టీ-పర్పస్ యూజ్‌కి మార్చబడుతుంది, దాంతో ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న జీవో ప్రక్రియ, మార్కెట్ విలువకు తక్కువగా 30–50% SR రేట్లే విధించడం ద్వారా, భూములు ప్రైవేట్ రియల్టర్స్ నెట్‌వర్క్‌కు తక్కువ ధరలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇది అతిపెద్ద కుంభకోణానికి తెరదీసే ప్రక్రియనేనని బిజెపి భావిస్తోంది.హైదరాబాద్‌లోని దాదాపు 9,000 ఎకరాల విలువైన పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ తీవ్ర అవినీతికి దారితీస్తుందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. SRO రేట్లలో 30% మాత్రమే చెల్లించి భూములను కన్వర్ట్ చేసుకునే విధానం వేల కోట్ల రూపాయల ప్రజాసంపదను కోల్పోయేలా చేస్తోందని మండిపడ్డారు. ఈ పాలసీ వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోవడంతో పాటు, రైతులకు తీవ్ర నష్టం జరిగే తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నిరసనగా డిసెంబర్ 7న ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు రాంచందర్ రావు ప్రకటించారు.















