ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 29
చలితో వణికిపోతున్న హైదరాబాద్ మహానరగరాన్ని మరోవైపు వాయు కాలుష్యం చుట్టుముట్టింది. చలి, పొగ మంచు కారణంగా వాయు కాలుష్యం పెరిగింది. శీతాకాలపు పొగమంచుకు తోడు వాహనాల ఉద్గారాలు, చెత్త దహనం వల్ల గాలిలో సూక్ష్మ ధూళికణాలు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే ఉదయం సమయంలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు, పారిశ్రామిక ప్రాంతాలు, ఐటీ జోన్లు, రద్దీ ఎక్కువగా ఉండే రోడ్ల వెంట ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. హైదరాబాద్‌లో గాలి నాణ్యత ప్రమాణం 230 దాటి ప్రమాదకర స్థాయికి చేరింది.















