EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

1న రంగస్థల నటుడు చక్రాల లక్ష్మికాంత శర్మకు జీవన సాఫల్య పురస్కారం

హైదరాబాద్ ఆగస్టు 26 (ఈతరం భారతం) : ప్రముఖ సాహితీ, సాంస్కృతిక సంస్థ శ్రీ మానస ఆర్ట్ థియేటర్స్ 44వ వార్షికోత్సవ సందర్భంగా సెప్టెంబర్ ఒకటవ తేదీ సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ త్యాగరాయ గానసభ ప్రధాన వేదికలో ప్రముఖ రంగస్థల పౌరాణిక నటుడు, రచయిత చక్రాల లక్ష్మికాంత శర్మకు జీవన సాఫల్య పురస్కార ప్రధానోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు సంస్థ కార్యదర్శి, ప్రముఖ కవి డాక్టర్ రఘుశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. ఆనాటి సభా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డిఎన్వి శాస్త్రి (గాయకులు నృత్య శాఖ కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్)సభాధ్యక్షులు కుందుర్తి వెంకటకృష్ణ, విశిష్ట అతిదులుగా చిట్టా వెంకట శివప్రసాద్, మదికొండ విశ్వేశ్వర శాస్త్రి, జొన్నలగడ్డ జగన్మోహన్రావు, ఆత్మీయ అతిథులు మల్లాది భాస్కర్, సుబ్బారాయశర్మలు పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు సభకు ముందు శ్రీ రామ సుగ్రీవ మైత్రి పౌరాణిక పద్యనాటక ప్రదర్శన జరుగుతుందని రఘుశ్రీ వెల్లడించారు.

Related News

Select the Topic
Scroll to Top