EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

17 నుంచి రాష్ట్రపతి శీతాకాల విడిది

ఈతరం భారతం హైదరాబాద్ డిసెంబర్ 9:

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దక్షిణాది శీతాకాల విడిది ఖరారైంది.ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె విడిది చేయనున్నారు.19న రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.20న గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో గ్లోబల్ పీస్ కమిటీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు హాజరవుతారు.21న వివిధ వర్గాల ప్రతినిధులతో సమావేశం అవుతారు. అనంతరం నిర్వహించే తేనీటి విందులో పాల్గొంటారు.22న ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

Related News

Select the Topic
Scroll to Top