ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 27:
2015 గ్రూప్ -2 ర్యాంకర్లకు ఊరట లభించింది. గ్రూప్-2పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. 2019లో చేపట్టిన గ్రూప్-2 నియామకాలను సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది. 2019 గ్రూప్-2 ఫలితాలపై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను టిజిపిఎస్సి ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ చేపట్టింది. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేయడంతో పాటు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. వైటనర్ వినియోగం, దిద్దుబాట్ల ఉన్న పార్ట్ బి జవాబు పత్రాలను తిరిగి మూల్యాంకనంపై అసహనం వ్యక్తం చేసింది. Also Read – తనిఖీ చేస్తున్న కార్మికులను ఢీకొట్టిన రైలు.. 11 మంది మృతి Advertisement ఆన్సర్ సీట్లలో ట్యాంపరింగ్ జరిగినా కూడా వాటిని కరెక్షన చేయడం మంచి పద్దతి కాదని తెలిపింది. సాంకేతిక కమిటీ సూచనల ప్రకారం రీ కరెక్షన్ చేసి అభ్యర్థుల అర్హుల జాబితాను విడుదల చేయాలని సూచించింది. ఎనిమిది వారాల్లోనే ఈ ప్రక్రియను ముగించాలని ఆదేశించింది. 2019 అక్టోబర్ 24న ఇచ్చిన ఫలితాలు ఏకపక్షమని, చట్టవిరుద్ధమని వాటిన రద్దు చేస్తామని హైకోర్టు తెలిపిన విషయం విధితమే. సాంకేతిక కమిటీ సిఫారసుల మేరకు హైకోర్టు గత తీర్పుకు తగ్గట్టుగా తిరిగి మూల్యాంకనం నిర్వహించడంతో పాటు అర్హుల జాబితాను విడుదల చేసి నియామకాలు చేపట్టాలని సూచనలు చేసింది. ఈ తీర్పుపై టిజిపిఎస్సి డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా కోర్టు సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేస్తూ ఇప్పుడు తీర్పునిచ్చింది.















