EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

25న విశ్వ‌క‌ర్మ‌ పొలిటిక‌ల్ స‌మ్మిట్  వాల్ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 22:

__________________________________

విశ్వ‌క‌ర్మ క‌మ్యూనిటీ జేఏసీ ఆధ్వ‌ర్యంలో మ‌రో కీల‌క రౌండ్ టేబుల్ స‌మావేశానికి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈనెల 25న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుండి 5 గంట‌ల వ‌ర‌కు విశ్వ‌క‌ర్మ పొలిటిక‌ల్ స‌మ్మిట్ నిర్వ‌హిస్తున్న‌ట్టు జేసేసీ క‌న్వీన‌ర్, పారిశ్రామికవేత్త, సీనియర్ జర్నలిస్ట్ దేవ‌ర‌కొండ కాళిదాస్, కో-క‌న్వీన‌ర్ అడ్లూరి ర‌వీంద్రాచారిలు తెలిపారు. తెలంగాణ‌లో విశ్వ‌కర్మ‌ల జ‌నాభా 10 నుండి 12 ల‌క్ష‌ల మ‌ధ్య ఉంద‌ని, కేవలం 2 శాతం ఓట్ల తేడాతో ప్ర‌భుత్వాలు ఏర్ప‌డుతున్న త‌రుణంలో… 4 నుంచి 5 శాతం ఓటు బ్యాంకుతో ఎన్నిక‌ల‌ను నిర్దేశించే స్థాయిలో విశ్వ‌క‌ర్మ‌లు ఉన్నార‌ని జేఏసీ నాయ‌కులు తెలిపారు. అయిదు వృత్తుల‌తోపాటుగా, అన్ని రంగాల‌లోనూ విశ్వ‌క‌ర్మ‌లు త‌మ స‌త్తా చాటుతున్నార‌ని గుర్తుచేశారు.

సోమాజిగూడలోని ప్రెస్ క్ల‌బ్ హైదరాబాద్‌లో జ‌రిగే పొలిటిక‌ల్ స‌మ్మిట్‌కు అన్ని పార్టీల‌లోని ప్ర‌జాప్ర‌తినిధులు, ముఖ్య నాయ‌కులు, స‌ర్పంచులు, ఎన్నిక‌ల‌లో పోటీ చేసిన, ఎన్నిక‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌, ఆశావ‌హ విశ్వ‌క‌ర్మ‌లు భారీగా త‌ర‌లివ‌స్తున్నార‌ని వెల్ల‌డించారు. ఈ స‌ద‌స్సుకు విశ్వ‌క‌ర్మ స‌మాజంలోని రాజ‌కీయ జిజ్ఞాస క‌లిగిన వారంతా హాజ‌రుకావ‌చ్చ‌ని వివ‌రించారు. విశ్వ‌క‌ర్మల‌ను రాజకీయాల‌కు స‌న్న‌ద్ధం చేయ‌డం, కొత్త‌ త‌రాన్ని ప్రోత్స‌హించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ స‌మ్మిట్ ఏర్పాటు చేసిన‌ట్టు చెప్పారు. ఈ సంద‌ర్భంగా మెట్రో కార్యాల‌యంలో స‌మ్మిట్ వాల్ పోస్ట‌ర్‌ను జేఏసీ ప్ర‌తినిధులు ఆవిష్క‌రించారు. రిటైర్డ్ ఇంజ‌నీర్ మ‌ల్ల‌య్య‌, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు బైరోజు వీర‌శేఖ‌రాచారి, బి.రాజ‌మౌళిచారి పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top