EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

31 అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్‌

ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 22 :రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ, జర్నలిస్టు, ఉద్యోగుల ఆరోగ్య పథకం వైద్య సేవలను ఈ నెల 31 అర్ధరాత్రి నుంచి నిలిపి వేయనున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌(టీఏఎన్‌హెచ్‌ఏ) ప్రకటించింది.బకాయిల చెల్లింపులో జాప్యం, ఆర్థిక భారం పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఏఎన్‌హెచ్‌ఏ తెలిపింది. ఈ మేరకు గురువారం ఆరోగ్యశ్రీ సీఈవోకు లేఖ రాసిన టీఏఎన్‌హెచ్‌ఏ… జనవరిలో ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.1,300-1,400 కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది.బకాయిలు గణనీయంగా పెరగడంతో చిన్న, మధ్య తరగతి ఆస్పత్రులను మూసివేసుకునే పరిస్థితి నెలకొందని టీఏఎన్‌హెచ్‌ఏ అధ్యక్షుడు వడ్డిరాజు రాకేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిలను 4-5 నెలల్లో చెల్లిస్తామని, ప్యాకేజీలను సవరిస్తామని మంత్రి ఇచ్చిన హామీ, ఆరు నెలలు గడిచినా అమలుకు నోచుకోలేదని లేఖలో పేర్కొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top