EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

60,799 వేల కోట్లతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణం… తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీ విని ఎరగని రికార్డు: రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఈతరం భారతం /హైదరాబాద్ /నవంబర్ 8:

60,799 వేల కోట్లతో రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చి సహకరించిన, గొప్ప కార్యక్రమానికి నిధుల మంజూరుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కు ధన్యవాదాలు చెప్పారు రోడ్లు భవనాల శాాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మౌలిక సదుపాయాల కల్పనతో బహుళ జాతి సంస్థలకు తెలంగాణ కేంద్రంగా మారబోతోంది. లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి, లక్షలాదిమంది గ్రామీణ యువతకు ఉపాధి కలగనుంది.10,400 కోట్లతో హైదరాబాద్- విజయవాడ హైవేను ఎనిమిది లైన్లుగా విస్తరణ. తెలంగాణ రాష్ట్ర గతిని మార్చే RRR రహదారి నిర్మాణానికి 36,000 వేల కోట్లు .రహదారులు లేని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం. సింగిల్ రోడ్డు ఉన్నచోట డబుల్ రోడ్ల నిర్మాణం.HAM ప్రాజెక్టుకు 11,399 కోట్లు.. కొద్ది రోజుల్లో టెండర్లు పిలుస్తున్నాం .వీటితోపాటు ప్రపంచంలోని పెట్టుబడిదారులు అంతా తెలంగాణ రాష్ట్రానికి తరలివచ్చేలా మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు రహదారుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు పెద్ద సంఖ్యలో రానున్నాయి. ఫలితంగా లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షలాదిమంది రాష్ట్ర యువతకు ఉపాధి లభించనుంది. 8,000 వేల కోట్లతోమన్ననూరు నుంచి శ్రీశైలం వరకు 52 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్.దేశానికే తలమానికంగా మారనున్న ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే. 20 వేల కోట్లతో నిర్మించనున్న ఈ రహదారి నిర్మాణంతో రాష్ట్ర ముఖచిత్రమే మారుతుంది. న భూతో న భవిష్యత్తు అన్న రీతిలో రహదారుల నిర్మాణానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నల్గొండ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు. ఈ పనులకు సంబంధించి ప్రతి 15 రోజులకు ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. నా రాజకీయ జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని కల్పించిన అందరికీ ధన్యవాదాలు అని చెప్పారుమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

Related News

Select the Topic
Scroll to Top