ఈతరం భారతం కరీంనగర్ అక్టోబర్ 22:
_______________________________
భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు సాయిని మల్లేశం గురువారం జిల్లా శాఖ కార్యవర్గ ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఉపాధ్యక్షులుగా గుర్రాల వెంకట్ రెడ్డి, బింగి వేణు, ఎర్రబెల్లి సంపత్ రావు , దురిశెట్టి సంపత్, సిహెచ్. నరసింహరాజు, గాజుల స్వప్నలను , జిల్లా ప్రధాన కార్యదర్శులుగా గుజ్జ శ్రీనివాస్ రావు, మాడ వెంకట్ రెడ్డి, కానుమల్ల గణపతిని, జిల్లా కార్యదర్శులుగా గుంజేటి శివకుమార్ ,కోల అశోక్ , సంపెల్లి సంపత్ రావు, చేపురి సత్యం గౌడ్ ,ధాడి సునీత , రెడ్డవేని రాజు లను, జిల్లా కార్యాలయ కార్యదర్శిగా కాడార్ల విమల్ కుమార్, జిల్లా ఐటీ కన్వీనర్ అన్నాజి వినీత్ కుమార్,జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గొడుగు వినోద్ కుమార్ ల నియామకం జరిగింది. జిల్లాలో భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడానికి, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలను, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి నూతన జిల్లా కార్యవర్గం కృషి చేయాలని జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం నూతన్ కార్యవర్గానికి సూచించారు.















