ఈతరం భారతం కమలాపూర్ నవంబర్ 28
కాంగ్రెస్ పార్టీ బీసీల కళ్లలో మట్టి కొట్టిందని,రెండేళ్లుగా డ్రామాలు ఆడి మొండిచేయి చూపించిబీసీ వర్గాలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి సిద్ధమవుతున్నారని పార్లమెంట్ సబ్యులు ఈటల రాజేందర్ విమర్శించారు.హుజురాబాద్ లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా వాళ్లందరినీ గెలిపించుకుంటాం.నేనే స్వయంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతా నన్నారు.కమలాపూర్ మండల కేంద్రంలో తన నివాసంలో గ్రామపంచాయితీలకు పోటీ చేసే అభ్యర్థులు, నాయకులతో అయన సమావేశ మయినారు.అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కామారెడ్డి డిక్లరేషన్ లో 42 శాతం బీసీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి రకరకాల డ్రామాలాడి మొండి చేయి చూపించారు. ఎన్నికలు వస్తాయని తెలిసినా సరైనా ఏర్పాట్లు లేవు. సర్వర్లు పని చేయడం లేదని కావలసిన సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. కొన్ని జిల్లాల్లో 17% మరికొన్ని జిల్లాల్లో 21% మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు దక్కాయి. రెండు సంవత్సరాల నిరీక్షణ తరువాత బీసీల కళ్లలో మట్టికొట్టారు. బీసీ వర్గాలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడానికి సిద్ధమవుతున్నారు. గ్రామాల్లో గతంలో పనిచేసిన సర్పంచులకు ఇప్పటివరకు బిల్లులు ఇవ్వలేదు. అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వచ్చిన డబ్బులు కూడా ఖర్చు చేయకుండా చేశారు. మళ్ళీ పోటీ చేయాలంటే భయపడుతున్నారు. రేపు నామినేషన్ చివరి రోజు.. కానీ చాలా ఊర్లలో బతిలాడి నామినేషన్ వేయించాల్సి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు గుణపాఠం తెచ్చుకొని స్థానిక సంస్థలను బ్రతికించాలి. హుజురాబాద్ లో 107 గ్రామపంచాయితీలున్నాయి. మొదటి విడతలో కమలాపూర్ మండలంలో ఎన్నికలు జరుతున్నాయి. 25 ఏళ్లుగా ఈ నియోజకవర్గంలో అన్ని ఎన్నికల్లో అన్ని పదవులు మేమే గెలుచుకుంటూ వస్తున్నాం. వార్డు మెంబర్లు, సర్పంచ్, ఎంపీటీసీ గెలవకుండా MLA గెలవడం అంత సులభం కాదు. గ్రామాలలో నేరుగా సంబంధం వారికే ఉంటుంది. ఇవి అతి కీలకమైన ఎన్నికలు. 25 ఏళ్లుగా ప్రజలతో సంబంధం ఉన్న వానిగా పోటీ చేసేవారికి అండగా ఉండి గెలిపిస్తానని మాట ఇచ్చాను. ప్రజల ఆశీర్వాదంతో ఈసారి కూడా గెలిపించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. రేపు కమలాపూర్ లో నామినేషన్లు చివరి రోజు. నామినేషన్ల విత్ డ్రా పూర్తి అయ్యాక గ్రామాలలో ప్రజలకు అప్పీలు చేసుకుని మా వారిని గెలిపించండి.. మీ ఆశీర్వాదంతో మళ్లీ మీకు సేవ చేసే అవకాశం కల్పించాలని నేనే స్వయంగా కోరతాను. ఇన్నాళ్లు నా గెలుపులో కీలక పాత్ర పోషించిన వారిని గెలిపించుకోవడం నా బాధ్యత. హుజురాబాద్ ప్రజానీకానికి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను నోట్లో నాలుకలా ఉండి, మీ మధ్యలో ఉండి, మీకు సేవ చేసే అభ్యర్థులను గెలిపించండి. మీరు మెచ్చిన, నచ్చిన అభ్యర్థులను మాత్రమే సాధ్యమైనంత మేరకు ఎంపిక చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండూ రెండే. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు లేవు, కేంద్రం నిధులు మాత్రమే వస్తున్నాయి. చౌరస్తాలో బల్బులు వెలగాలన్నా, సిమెంట్ రోడ్లు వేయాలన్నా, మొరీలు కట్టాలన్నా, అంగన్వాడీ బిల్లింగ్ కట్టాలన్నా, గ్రామపంచాయితీ సిబ్బంది జీతాలు రావాలన్నా కేంద్రం నిధులు మాత్రమే దిక్కు. బీజేపీకి ఓటు వేస్తే ఎక్కువ మొత్తంలో నిధులు తీసుకొని వస్తానన్నారు.















