ఈతరం భారతం/కరీంనగర్, నవంబర్ 7:
జిల్లా పరిధిలోని తిమ్మాపూర్ కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులు రాష్ట్రస్థాయి కళోత్సవాలలో తమ ప్రతిభను కనబరిచారు. థియేటర్ రోల్ ప్లే లో భాగంగా భారత రాజ్యాంగం అంబేద్కర్ చరిత్ర అనే అంశాన్ని వారు అద్భుతంగా ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. రాష్ట్రస్థాయిలో జరిగిన ఈ పోటీలో విద్యార్థినులు ప్రథమ బహుమతిని అందుకొని జాతీయస్థాయికి అర్హత సాధించారు. రోల్ ప్లే చేతలైన విద్యార్థినులకు పాఠశాల ప్రత్యేక అధికారి పడాల కిరణ్ జ్యోతి,ఉపాధ్యాయులు, విద్యార్థినులు అభినందనలు తెలిపారు.















