ఈతరం భారతం/తిమ్మాపూర్/ కరీంనగర్/ నవంబర్ 11:జిల్లా పరిధిలోని తిమ్మాపూర్ మండల కేంద్రం ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులు రాష్ట్రస్థాయి కళోత్సవాలలో థియేటర్ రోల్ ప్లే లో భాగంగా భారత రాజ్యాంగం అంబేద్కర్ చరిత్ర అనే అంశాన్ని ప్రదర్శించారు. రాష్ట్రస్థాయిలో జరిగిన ఈ పోటీలో కేజీబీవీ తిమ్మాపూర్ విద్యార్థినులు ప్రథమ బహుమతిని అందుకొని జాతీయస్థాయికి ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా రోల్ ప్లే విజేతలుగా నిలిచిన విద్యార్థినులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా విద్యాధికారి శ్రీరాముండయ్య, జెండర్ కోఆర్డినేటర్ డాక్టర్ కృపారాణి, సెక్టోరియల్ అధికారులు అశోక్ రెడ్డి, శ్రీనివాస్ అభినందించారు.















