EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఈనెల 22న ఐఏఎల్ ఆధ్వర్యంలో ఏఐబిఇ నమూనా పరీక్ష

ఈతరం భారతం/ఖమ్మం లీగల్/నవంబర్ 12

న్యాయవాదుల అర్హత కోసం త్వరలో జరగనున్న అఖిల భారత బార్ ఎగ్జామ్ (ఏఐబిఈ) లో ఉత్తీర్ణులు అవటానికి సాధనలో భాగంగా నమూనా పరీక్ష ను ఈనెల 22వ తేదీన మానీర్ కాలేజ్ అప్ లా నందు నిర్వహించబడుతుందని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ (ఐఏఎల్) ఖమ్మం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ లతీఫ్, ఓరుగంటి శేషగిరిరావులు తెలియజేశారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణంలో ఏఐబిఈ మాక్ టెస్ట్ ఎన్రోల్మెంట్ కోసం ఆన్లైన్ లింకును వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా న్యాయవాద వృత్తులోకి ప్రవేశించిన వారు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయాలంటే ఏఐబిఈ పరీక్ష ఉత్తీర్ణులవటం తప్పనిసరి అన్నారు . అందుకోసం ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ వారు ప్రతి సంవత్సరంలో రెండుసార్లు ఏఐబిఈ పరీక్ష నిర్వహిస్తారన్నారు. న్యాయవాద పట్టా పొందినవారు రెండు సంవత్సరాల లోపు ఉత్తీర్ణుల అవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అత్యంత కఠినంగా ఉండే ఈ పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వాలంటే కష్టతరమన్నారు. దీన్ని సులభతరం చేయడానికి నమూనా పరీక్షను ఖమ్మం జిల్లా కేంద్రంలోని మానేరు కాలేజ్ ఆఫ్ లా నందు ఈనెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు నిర్వహించబడుతుందన్నారు. ఆసక్తి ఉన్నవారు https://forms.zohopublic.in/indianassociationoflawyers1/form/IALAIBEMOCKEXAM2025/formperma/uuuVN1-9UfUq_wKA9VkTVgRwSIl9WCsX_KxdNOKQfkE తోపాటు ముమ్మడి సతీష్ 9100999344, ఎండి పర్వేజ్ 9700683404, రేగళ్ల రాకేష్ 9959913729, యు తదితరులకు ఫోన్లు ద్వారా నమోదు చేసుకోవచ్చన్నారు. పరీక్ష రాయదలచిన వారు ఉదయం 10 గంటల వరకు నేరుగా కళాశాలకు వచ్చి నమోదు కూడా చేసుకోవచ్చు అన్నారు.

Related News

Select the Topic
Scroll to Top