ఈతరం భారతం ఖమ్మం, నవంబర్ 15:రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల
ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఎన్నికలు ఉత్కంఠ భరితంగా సాగాయి. ప్రజాస్వామిక పద్ధతిలో బ్యాలెట్ తో అభ్యర్థులను ఎన్నుకున్నారు. ఖమ్మం జిల్లా పెన్షనర్ల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక.
ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారిగా మైస నాగయ్య పరిశీలకులుగా ప్రహ్లాద రావు వ్యవహరించారు. జిల్లా అధ్యక్షులుగా మేదరమెట్ల సుబ్బయ్య ప్రధాన కార్యదర్శిగా తాళ్లూరి వేణు ఆర్థిక కార్యదర్శిగా రాయల వెంకటనారాయణ తోపాటు జిల్లా అసోసియేట్ అధ్యక్షులుగా వి చెంచిరెడ్డి ఉపాధ్యక్షులుగా సాధినేని పూర్ణచంద్రరావు పి సాంబశివరావు ఆర్ దుర్గా దేవి కార్యదర్శిగా టీ జనార్దన్ రావు ఎస్ లక్ష్మీపతిరావు జాయింట్ సెక్రటరీగా కాజా మొయినుద్దీన్ పి జానయ్య ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బి ఉపేందర్ రావ్ డి రఘుపతి రెడ్డి ఎస్ సుగుణ రాజేంద్రన్ ప్రచార కార్యదర్శిగా బి కృష్ణారెడ్డి రాష్ట్ర కౌన్సిలర్ గా సి బాబురావు కె రామ్మోహన్రావు వద్ద శ్రీనివాసరావు. అనంతరం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం సుబ్బయ్య తాళ్లూరి వేణు మాట్లాడుతూ ప్రభుత్వం పెన్షనర్లకు ఇచ్చిన హామీ మేరకు రిటైర్డ్ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని పెన్షనర్ల ఆరోగ్య కార్డులను అన్ని ఆసుపత్రులలో అమలయ్యే విధంగా ఒప్పందం మేరకు ఈ నెల 30లోగా ఉత్తర్వులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లోని కరువు భత్యం పి అర్ సి ప్రయోజనాలు తదితర దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారం కొరకు వెంటనే ప్రభుత్వం వెంటనే రిటైర్డ్ ఉద్యోగుల సంఘంతో సమావేశం ఏర్పాటు చేసి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లా సంఘ కార్యవర్గ ఎన్నికలలో ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి తల్లాడ పెనుబల్లి వైరా ఏనుకూరు మధిర ఎర్రుపాలెం నేలకొండపల్లి కూసుమంచి ఖమ్మం నగరంలోని నాలుగు శాఖల బాధ్యులు ఈ ఎన్నికలలో పాల్గొన్నారు.















