ఈతరం భారతం ఖమ్మం జూలై 22 :ఉత్తమ డ్రైవింగ్ మెళకువలను అలవరచుకోవడం ద్వారా, ప్రమాదాల సంఖ్యను తగ్గించడం కోసం తద్వారా ప్రయాణికుల మన్ననలను పొందడం కోసం టీ.ఎస్.ఆర్టీసీ, ప్రమాదాలకు కారణమైన డ్రైవర్లకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఈరోజు ఖమ్మం నూతన బస్ స్టేషన్ లో గల కాన్ఫరెన్స్ హాల్ లో ప్రారంభించింది. ఇట్టి శిక్షణా కార్యక్రమానికి రీజియన్ లోని డిపోల నుండి డ్రైవర్లు హాజరయ్యారు. ఈ శిక్షణా కార్యక్రమంలో, ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ ,శ్రీ. సరి రామ్ గారు మాట్లాడుతూ, రెండు రోజుల శిక్షణ కార్యక్రమం లో తెలియజేయబడే సాంకేతిక అంశాలను అలవర్చుకునే డ్రైవింగ్లో మెలకువలను తెలుసుకుని ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాల్సిందిగా డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా విచ్చేసిన, ఖమ్మం పట్టణ ట్రాఫిక్ ACP,శ్రీ.N.శ్రీనివాసులు గారు మరియు ట్రాఫిక్ సీ. ఐ,శ్రీ. B.సత్య నారాయణ గారు హాజరై, ట్రాఫిక్ నిబంధనలను గురించి మరియు వాటిని పాటించకపోవడం వల్ల జరుగుతున్న అనర్ధాలు గురించి సోదాహరణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో, డిప్యూటీ రీజినల్ మేనేజర్, V.మల్లయ్య పాల్గొన్నారు.















