ఈతరం భారతం డిసెంబర్ 8 ఖమ్మం
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సోమవారం కలెక్టరేట్‌లో మాట్లాడుతూ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణలో స్టేజ్–2 రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. మూడు విడతలుగా జరిగే ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, వివాదాలకు తావులేకుండా నిర్వహించాలని ఆదేశించారు. పోలింగ్ రోజు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్, అనంతరం ఓట్ల లెక్కింపు జరిపి ఉపసర్పంచ్ ఎన్నిక చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు, భద్రత, నిర్వహణలో అధికారులు సమన్వయం పాటించాలని ఆయన సూచించారు.















