ఈతరం భారతం ఖమ్మం, నవంబర్ 18:రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్, మధుశ్రీ నలుబోల
నాయి బ్రాహ్మణుల వనసమారాధన కోలాహాలంగా జరిగింది. ఖమ్మం నగరంలోని చెరుకూరి వారి మామిడితోటలో ‘ఖమ్మం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక’ ఆధ్వర్యంలో మంగళవారం నాడు నాయి బ్రాహ్మణులు వనసమారాధన వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నాయి బ్రాహ్మణ వనసమారాధన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రిటైర్డ్ డిజిపి పూర్ణ చందర్ రావు, రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దుగ్యాలా అశోక్, బీసీ జేఏసీ నాయకులు దేవరకొండ సైదులు, ఆలిండియా బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ యూనివర్సిటీ చైర్మన్ గౌడ కిరణ్ కుమార్, నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక నగర అధ్యక్షులు యలమందల జగదీష్ లు పాల్గొని ప్రసంగించారు. ఈ వేడుకలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల నుండి నాయి బ్రాహ్మణులు 5 వేల మందికి పైగా రావడం ఐకమత్యానికి నిదర్శనమన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాయి బ్రాహ్మణులందరూ ఒక కుటుంబంగా ఒకే వైదికపైకి తీసుకురావడం గొప్ప అనుభూతి నిచ్చిందన్నారు. ఇది భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలన్నారు. పిల్లలు, మహిళలు, యువత పాటలు, ఆటలు, కేరింతలతో సరదాగా గడిపే ఈ మధుర క్షణాలు తమ తరాల వారసులకు శాశ్వతంగా గుర్తుండాలన్నారు. ముఖ్యంగా నాయి బ్రాహ్మణులు విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, సేవా రంగాల్లో ఐకమత్యంతో ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. అనాదిగా కులవృత్తితో సమాజ సేవా కార్యక్రమాల్లో ఉంటున్నప్పటికీ అవకాశం ఉన్నంత వరకు రాజకీయ నాయకులుగా, పాలకులుగా ఎదిగినప్పుడే నాయి బ్రాహ్మణ సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ వనసమారాధనలో ఉద్యోగస్థులు, రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారస్థులు, వృత్తి దారులు, చిన్నా పెద్దా తారతమ్యం లేకండా ఆడి పాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాయి బ్రాహ్మణులు కుటుంబ సమేతంగా తరలివచ్చి విజయవంతం చేసినందుకు సంతోషంగా ఉందని, ఆధ్యాత్మికత, ఆహ్లాదం, ఐక్యమత్యంగా ఉండటం వలన ఈ కార్యక్రమం విజయవంతం అయిందన్నారు. ఈ సంవత్సరం మొదలుకొని ప్రతి సంవత్సరం జరిగే వనమహోత్సవాలు నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి వేదికవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం నగర అధ్యక్షులు, ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్షులు యలమందల జగదీశ్, సంఘం జిల్లా అధ్యక్షులు నంద్యాల నర్సింహారావు, జిల్లా సెక్రటరీ రావులపాటి శ్రీనివాసరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొలిపాక బాబురావు, కుదురుపాటి వెంకటేశ్వరరావు, దుర్గయ్య, చాగంటిపాటి వాసు, సూత్రపు రాంబాబు, రాచమళ్ళ అభి, గుండ్లపల్లి శ్రీనివాస్, నగర ప్రధాన కార్యదర్శి సురభి సైదులు, నగర గౌరవ అధ్యక్షులు నంద్యాల రాము తదితరులు పాల్గొన్నారు.















