ఈతరం భారతం డిసెంబర్ ఖమ్మం 29
ఖమ్మం జిల్లాలో ప్రపంచ మాదిగల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ టీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు లంక వెంకటేశ్వర్లు (ఎల్.వి.ఆర్ మాదిగ) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా శ్రీ బాబు జగజీవన్ రావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జెడ్పీ సెంటర్ వరకు భారీ ర్యాలీ (రన్‌వే) నిర్వహించబడింది.జెడ్పీ సెంటర్‌లో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా లంక వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రపంచ మాదిగల దినోత్సవాన్ని ప్రతి మాదిగ కుటుంబంపండుగ రోజుగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అన్ని కుల సంఘాలు ఐక్యంగా ముందుకు నడవాలన్నారు. మాదిగ సమాజం విద్యాపరంగా, ఆరోగ్యపరంగా బలపడుతూ, మంచి చదువులు చదివి ఉద్యోగాల ద్వారా ఆర్థికంగా స్థిరపడాలని సూచించారు. అలాగే రాజకీయపరంగా కూడా అన్ని విధాలా ముందుండి హక్కుల సాధనలో చురుకుగా పాల్గొనాలన్నారు. ప్రతి గ్రామం, ప్రతి మాదిగ పల్లెలో ఈ దినోత్సవాన్ని పండుగలా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమం దండోరా రాష్ట్ర అధ్యక్షులు కోరపల్లి శ్రీనివాస్ మాదిగ అధ్యక్షతన నిర్వహించబడింది.
కార్యక్రమంలో సీనియర్ కళాకారులు శ్రీ పమ్మి రవి మాదిగఆటపాటలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే డక్కల హక్కుల పోరాట సమితి సీనియర్ నాయకులు డేవిడ్, జిల్లా సీనియర్ నాయకులు కుక్కల రామకృష్ణ మాదిగ, పుట్ట పింజర వెంకటరత్నం మాదిగ, సీనియర్ నాయకులు నకరికట్టి సంజీవరావు మాదిగ, సీనియర్ నాయకురాలు ఇటికల లత మాదిగ, సిపిఐ సీనియర్ నాయకులు నాగేశ్వరావు, అలాగే వివిధ కుల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.















