EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవ ప్రారంభోత్సవం

ఈతరం భారతం ఖమ్మం జనవరి 1

ది.01.01.2026 నుండి 31.01.2026 వరకు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు సందర్భంగా ఖమ్మం డిపో గ్యారేజ్ నందు ఈ రోజు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవ ప్రారంభోత్సవము ఖమ్మం డిపో మేనేజర్ శ్రీ శివప్రసాద్  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడమైనది. ఇట్టి కార్యక్రమమునకు senior M.V.I L.Rajashekar గారు, వారి బృందం మరియు డిప్యూటీ ఆర్. ఎం. ఖమ్మం శ్రీ మల్లయ్య  ముఖ్యఅతిథిగా హాజరైనారు. MVI  మాట్లాడుతూ నూతనంగా వస్తున్న వాహనముల యొక్క టెక్నాలజీని డ్రైవర్లు ఎప్పుడు ఎప్పటికప్పుడు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. రోడ్డు భద్రత గురించి సలహాలు సూచనలు చేశారు. Dy. RM ఖమ్మం గారు మాట్లాడుతూ డ్రైవర్లు ఆర్టీసీ రథసారథులని, ఖమ్మం డిపో నందు అత్యధికంగా 27 సంవత్సరాలు ప్రమాదరహిత డ్రైవర్లు ఉండడం గొప్ప విషయం అని కొనియాడారు. డిపో మేనేజర్, ఖమ్మం  మాట్లాడుతూ రోడ్డు భద్రత మహోత్సవాల్లో భాగంగా ఈ నెల రోజులు ఖమ్మం డిపో నందు రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. Medical day, maintainence day, family counselling day, training day, blood donation camp ఇలా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సురక్షిత ప్రయాణం ఆర్టీసీ నినాదం అని, ఇక్కడ డ్రైవర్ల అందరూ నిరంతరం శిక్షణ తీసుకుంటారని, రోడ్డు భద్రతపై డ్రైవర్లు అందరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపినారు.

ఈ కార్యక్రమము నందు ఆర్టీసీ ఎంప్లాయిస్ సుమారు 50 మంది పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top