EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలుగు వెలగాలి

ఈతరం భారతం ఖమ్మం డిసెంబర్ 27

జనవరి 3,4,5 తేదీలలో గుంటూరు ఆంద్ర సారస్వత పరిషత్ గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు ను వెలిగించడం కోసం భవిష్యత్ తరాలు ఆధరింబడేలా చేసే కృషి అభినందనీయమని ఉమ్మడి ఖమ్మం జిల్లా పోస్టల్ సూపరిండెంట్ వి. వీరభద్ర స్వామి అన్నారు ఈరోజు ఖమ్మం గాందీ చౌక్ నందు గల కార్యాలయం లో ప్రపంచ తెలుగు మహాసభ ల ప్రచార పత్రిక ను ఆవిష్కరిస్తూ మాట్లాడినారు. మన మాతృభాష గోప్ప ఓన్నత్యం గలదని పరభాష వారు కూడా తెలుగును కొనియాడినారని గుర్తుచేశారు.

ఈ కార్యక్రమం లో వికాస వేదిక సాహిత్య సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు భాష అనేక సాహిత్య ప్రక్రియలకు అలవాలం గా మృదు మధురంగా ఉంటుందని భాషను కాపాడుకోవాలని కోరారు.సంస్థ గౌరవాధ్యక్షులు బుక్కా సత్యనారాయణ, జిల్లా అధ్యక్ష కార్యదర్శి గాజుల భారతి, తిరునగరి శ్రీనివాస్, యువత విభాగం కార్యదర్శి వి లక్ష్మి నరసింహ చారి, ఆంగోతు జయవాసు, కొంపల్లి రామయ్య, గుమ్మడి పుల్లయ్య లు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top