ఈతరం భారతం ఖమ్మం, నవంబర్ 18: మధుశ్రీ నలుబోల:
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జనం బాట కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పర్యటన లో భాగంగా ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ హోటల్ నందు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జాగృతి అధ్యక్షురాలు కవిత అనేక అంశాలను ప్రస్తావించారు.
పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేని యువత, మహిళలుకు రాజకీయ అవకాశాలు వచ్చేందుకు మేము పోరాటం చేస్తామని ఆమె తెలిపారు ఖమ్మం జిల్లాలో ఆంధ్ర తెలంగాణ ఆదివాసి గిరిజనులు ఇలా అన్ని రకాల ప్రజలు ఉంటారని కానీ ఈ జిల్లాల్లో సామాజిక న్యాయం జరగలేదు అని ప్రస్తావించారు మొత్తం ఖమ్మం చరిత్రలోనే ఒక్క బీసీ కి మాత్రమే మంత్రి పదవి దక్కిందని మహిళల్లో కూడా ఒక్కరిద్దరికీ మాత్రమే మంచి పదవులు దక్కాయని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఒకరితో ఒకరికి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు మంత్రులు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి పనులు కాకుండా చేస్తున్నారు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కోత పెట్టారు ఇచ్చిన బిల్లులు కూడా రావడం లేదు దానిపై మంత్రులు రివ్యూ చేసి సమస్యలు పరిష్కరించాలని ఆమె అన్నారు.మున్నేరు వరదలు కారణంగా మున్నేరు పరిసర ప్రాంతాల్లో ఉండే కాలనీలో రిటైనింగ్ వాల్ కంప్లీట్ చేయాలి మొన్తా తుఫాన్ కారణంగా ఖమ్మం రైతులు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు ఇప్పుడైనా రైతుల సమస్యల పై ప్రభుత్వం దృష్టి పెట్టాలని
అంతేకాకుండా ఖమ్మం కు యూనివర్సిటీ లేదు యూనివర్సిటీ సాధించాలి అలాగే పాలేరు పాలిటెక్నిక్ కాలేజీకి బిల్డింగ్ కట్టాలి నిరుద్యోగుల ద్వారా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వారిని చాలా ఇబ్బంది పెడుతుంది వెంటనే జాబ్ క్యాలెండర్ చేసి దాని ప్రకారం జాబ్స్ నింపాలి గ్రూప్ సభ్యులు కాకుండా ఇతర ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలి తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలని ఇస్తే ఇక్కడ ప్రజల కోసం పనిచేయటం లేదు వారు ఎవరు కూడా ప్రజల బాగోగుల్లో భాగం పంచుకోవాలని బిజెపి నేతలను డిమాండ్ చేస్తున్నా హైదరాబాదులో హైడ్రా ఏర్పాటు కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ నష్టపోతుంది . ఎంతోమంది వ్యాపారులు ఏజెంట్లు పార్ట్ టైం చేసుకునే వాళ్ళు నష్టపోయారు హైదరాబాద్ వెంచర్లకు సర్టిఫికెట్లు ఇవ్వాలి . హైడ్రాను పాజిటివ్‌గా వాడుకొని అందరికీ లాభం చేయాలని ఆమె కోరారు గ్రానైట్ పరిశ్రమ వారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు . టిఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్లపై పన్ను భారం మోపింది దాన్ని తగ్గించాలి ఈ ప్రాంతంలో సిరిసంపదలు మీరు తీసుకొని ఇక్కడ ప్రజలకు కాలుష్యం ఇస్తున్నారని ఆమె అన్నారు కానీ స్థానికులకు ఉపాధి కల్పించడం లేదు ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు స్థానికులకు ట్రైనింగ్ ఇచ్చి వారిని పనిలో పెట్టుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.















