ఈతరం భారతం ఖమ్మం, నవంబర్ 15: రీజినల్ నెట్వర్క్ ఇంఛార్జ్, మధుశ్రీ నలుబోల.
గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్ స్వర్నోత్సవాళ్ల సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే గాంధీజీ ఎతైన విగ్రహం ఏర్పాటు లో చేస్తున్నకార్యక్రమానికి సంఘీభావంగా ఒక్క అడుగు గాంధీ విగ్రహాలను రాష్ట్రమంతటా సేకరించి హైదరాబాద్ నగరంలో లక్ష విగ్రహాల ప్రదర్శన చేసి ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలకు అలాగే విద్యాసంస్థలలో, లైబ్రరీలకు, పోలీస్ స్టేషన్లో పబ్లిక్ స్థలంలో వారి వారి కార్యాలయంలో టేబుల్ పైన విగ్రహం పెట్టుకునే విధంగా కార్యక్రమం చేస్తున్న తరుణంలో గాంధీ సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని ఆకాంక్షతో మొదటి ప్రోగ్రామ్ గా ఖమ్మం టౌన్ లో భక్త రామదాస్ కళాక్షేత్రం హాల్లో 1200 విగ్రహాలు అలాగే 150 చరఖా లతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ స్కూల్స్ స్టూడెంట్స్ గాంధీ స్ఫూర్తికి అనుబంధంగా ఆటలు, పాటలు దేశభక్తి నృత్యాలు చేశారు . అలాగే వ్యాస రచన పోటీలు కూడా నిర్వహిించారు. తదుపరి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అలాగే ఉత్తమ ప్రతిభ వారికి షిలీడ్స్ ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంకు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ్ సహాయం రఘురామ్ రెడ్డి అలాగే తుమ్మల యుగేందర్ , కమీషనర్ ఆఫ్ పోలీస్ అలాగే ఎంపీ మాట్లాడుతూ స్టూడెంట్స్ కి గాంధీ సిద్ధాంతాలను గుర్తు చేస్తూ పిల్లలు ఆ బాటలో నడవాలని కోరారు అలాగే డాక్టర్ ప్రకృతి వైద్యులు రాంచంద్ర గాంధీ ఆశ్రమాల గురించి చెప్పారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు విజయాబాయ్ కూడా వారి సందేశాన్ని ఇచ్చారు .ఈ కార్యక్రమానికి గాంధీగ్లోబల్ ఫ్యామిలీ మరియు గాంధీ జ్ఞాన్ ప్రతిష్టన్ సంస్థల చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి , వైస్ చైర్మన్ యానాల ప్రభాకర్ రెడ్డి , కన్వీనర్ గాంధారి ప్రభాకర్ , వైస్ ప్రెసిడెంట్ నీరుడు దయాకర్ రెడ్డి , స్టేట్ ఆర్గనైజషన్ సెక్రటరీ మెరుగు మధు , సుభాష్ చంద్ర బోస్ గూడూరు మదన్ మోహన్ పాల్గొని వారి వారి సందేశాన్ని ఇచ్చారు .ఈ కార్యక్రమాని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ , గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ రాష్ట్ర యూత్ అధ్యక్షులు కాలసాని సంజయ్ రెడ్డి , మహిళా అధ్యక్షురాలు బొమ్మ ప్రవళిక , అలాగే యూత్ టీం సంతోష్ రెడ్డి, హేమంత్,ఖలీల్, శ్రీకాంత్, రాజ్ కుమార్,, సతీష్ ఎడమడ్ల సంతోష్, శ్రావణి రెడ్డి, బొమ్మ అమర్, క్రాంతి, కాలసాని వర్షా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.















