EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ కు,  7 సబ్ స్టేషన్ల నిర్మాణానికి వర్చువల్ శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఈతరం భారతం ఖమ్మం జిల్లా నవంబర్ 22

వైరా నియోజకవర్గ కేంద్రంలో 200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ కు,  వైరా నియోజకవర్గంలో రూ. 21 కోట్ల వ్యయంతో నిర్మించబోయే7 సబ్ స్టేషన్ల నిర్మాణానికి వర్చువల్ శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.  వైరా ఎమ్మెల్యే రామదాసు నాయక్.జిల్లా కలెక్టర్, వివిధ గురుకుల పాఠశాలలు, కళాశాలలు నుండి విద్యార్థులు విద్యార్థినిలు,విద్యార్థుల తల్లిదండ్రులు కాంగ్రెస్ పార్టీ నేతలు,కార్యకర్తలు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ భట్టి విక్రమార్క వైరా లో తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయటం మంచి పరిణామం అని అన్నారు.

తెలంగాణా వ్యప్తంగా గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు 200%చార్జీలు పెంచింది మా ప్రభుత్వమే.బడుగు బలహీన వర్గాల కు ఉన్నత విధ్య ద్వారానే వారు ఉన్నత స్థానానికి చేరుతారు.గత పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ డ్వాక్రా మహిలలను మోసం చేసింది.మా ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.రాష్ట్రంలో 590 కోట్లు వేచ్చించి నిరుపేదలకు రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యాన్ని అందించిన ఘనత మా ప్రభుత్వానిదే.రాష్ట్రం లో ఉన్న మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించింది మేమే.ఈ నియోజకవర్గం నేను పుట్టిన ఈ నేల కోసం తప్ప నిసరిగా అభివృద్ధి చేస్తా, ఇప్పటికే వంద పడకల ఆసుపత్రి కి శంకుస్థాపన చేశాను ఇప్పుడు రెండు ఫోర్స్ పూర్తి అయినాయి అని చెప్పారు.

గతంలో వైరా రిజర్వాయర్ రైతు లకోసం నీటిని వదిలే విషయం లో జైలుకి కూడా వెళ్ళినాను.ఈ ప్రభుత్వం రైతులకి అంకితం. దోపిడి దారులకి దొంగలకు కాదు.ప్రపంచం తో పోటీపడే విదంగా తెలంగాణ రాష్ట్రన్ని అభివృద్ధి పధంలో నడిచే విదంగా తీసుకొని పోతాం అన్నారు.

వైరాలో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన భట్టి విక్రమార్క.వైరా నియోజకవర్గం వ్యాప్తంగా 1456 డ్వాక్రా సంఘాలు కు153 కోట్లు రూపాయలు బ్యాంకు లింకేజీ చెక్కు అందించారు

Related News

Select the Topic
Scroll to Top