EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన డిషనల్ డీసీపీ లా&అర్డర్ ప్రసాద్ రావు

ఈతరం భారతం నవంబర్ 17 టౌన్ ఏసీపీ కార్యాలయం ఖమ్మం :

రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ ను అడిషనల్ డీసీపీ లా&అర్డర్ ప్రసాద్ రావు సందర్శించారు. సోమవారం పోలీస్ స్టేషన్ కు చేరుకున్న అడిషనల్ డీసీపీ స్టేషన్ నిర్వహణ, పోలీసుల పనితీరు, సెక్టార్ అధికారుల విచారణ నివేదికలు,.CCTNS అప్లోడ్, జనరల్‌ డైరీ రికార్డులను పరిసరాలను పరిశీలించారు. పిటిషన్ విచారణలకు సంబంధించి సిబ్బందితో మాట్లాడారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన కేసులు, డయల్ 100 కాల్స్ ప్రతిస్పందన సమయం, సస్పెక్ట్ షీట్‌లు, పెండింగ్‌ కేసులు పరిశీలించారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ.. వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని అన్నారు. స్టేషన్ హౌస్ మేనేజ్‌మెంట్, పోలీస్ స్టేషన్ నిర్వహణ, సెక్టార్ ఆఫీసర్ల భాధ్యతలు విధిగా అమలు చేయాలని సూచించారు. పెట్రో కార్, బీట్ డ్యూటీ సిబ్బంది ఏవిధమైన విధులు నిర్వహిస్తున్నారు? పాత నేరస్ధుల నివాసాలను కదలికలను ఏవిధంగా గుర్తిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా వివిధ కేసుల్లోని వాహనాలను పరిశీంచారు.కార్యక్రమంలో టౌన్ ఏసీపీ రమణమూర్తి పాల్గొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top