ఈతరం భారతం/ఖమ్మం /నవంబర్ 9:రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్, మధుశ్రీ నలుబోల.
ప్రముఖ పారంపర్య ఆయుర్వేద వైద్యులు రామడుగు వీరభద్రాచారిని విశ్వకర్మ ఎంప్లాయిస్ ప్రొఫెషనల్స్ డెవలప్మెంట్ సర్వీస్ ఖమ్మం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు.కార్తిక వన సమారాధన చెరుకూరివారి మామిడి తోటలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ పారంపర్య ఆయుర్వేద వైద్యులు రామడుగు వీరభద్రాచారిని విద్యుత్ శాఖ ఖమ్మం ఎస్ ఇ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, వేదాస్ అధ్యక్షులు చెన్నోజు పుల్లయ్య , ప్రధాన కార్యదర్శి జయంతి శ్రీనివాస్ , కోశాధికారి సున్నం వెంకట రమేష్ , రాష్ట్ర సంఘం నాయకులు చిట్టోజు రమేష్ తోపాటు సంఘ సభ్యులు వీరభద్రాచారి ని శాలువా కప్పి పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానం చేశారు.
పారంపర్య వైద్యులు రామడుగు వీరభద్రాచారి మాట్లాడుతూ ప్రతి ఇరవై ఏడు రోజులకోసారి వచ్చే పుష్యమి నక్షత్రం రోజున ఒక సంవత్సరం నుండి పదహారు సంవత్సరాల లోపు వయసుగల పిల్లలకు ఆయుర్వేద ఇమ్మ్యూనిటి చుక్కలమందు రామభద్ర ఆయుర్వేద మూలికాయోగ పీఠం ఖమ్మం ఆధ్వర్యంలో ఉచితంగా వేస్తున్నట్లు దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.విశ్వకర్మ పంచ వృత్తుల వారు యాంత్రికరణ దాటికి తట్టుకోలేక అనేకమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఇది మంచిది కాదని, పంచ వృత్తుల వారికి మనోధైర్యం కల్పించేందుకు ఖమ్మం లోని వీడియోస్ కాలనీలో ఉన్న తమ నివాసంలోఉచితంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నమని దీనిని సద్వినియోగం చేసుకోవాలని వీరభద్ర చారి పిలుపునిచ్చారు. ఆయుర్వేద మూలికాయోగ పీఠం చేస్తున్న ఉచిత సేవలకు గుర్తింపుగా ఘన సన్మానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.















