EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

విదేశాల్లో నర్సింగ్ విద్యకు ఎంతో ప్రాధాన్యత… మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఈతరం భారతం ఖమ్మం / సత్తుపల్లి :

————————————–

నర్సింగ్ విద్యకు జర్మనీ లాంటి విదేశాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ లతో కలిసి సత్తుపల్లి ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో ఆశా ఫౌండేషన్ ద్వారా నర్సింగ్ విద్యార్థినులకు పుస్తకాలు, మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ జర్మనీ లాంటి విదేశాల్లో నర్సింగ్‌కు విపరీతమైన డిమాండ్ ఉన్నందున, మన విద్యార్థులకు జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువ వేతనాలు పొందవచ్చనే ఉద్దేశంతో ఆ శిక్షణను కూడా కాలేజీల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పాలేరు నియోజకవర్గంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన నర్సింగ్ కాలేజీని పూర్తిస్థాయిలో నిర్మించి ప్రారంభించడం జరిగిందని, సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన నర్సింగ్ కాలేజీని కూడా సుమారు రూ. 19 కోట్ల వ్యయంతో, అతి త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి అన్నారు.* రాబోయే కొద్ది రోజుల్లోనే నర్సింగ్ కాలేజీకి కావలసిన ఫ్యాకల్టీని కూడా పూర్తిగా సమకూర్చడం జరుగుతుందని అన్నారు.డాక్టర్ తర్వాత అంతటి ప్రాధాన్యత నర్సింగ్ వృత్తికి ఉంటుందని, రోగులకు మెరుగైన సేవలు అందిస్తూ కాలేజీకి, ప్రాంతానికి, కుటుంబానికి మంచి పేరు తీసుకొని రావాలని విద్యార్థులను కోరారు. ఆశా ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు కావలసిన స్టడీ మెటీరియల్ అందజేయడం అభినందనీయమని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో* కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, సత్తుపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ రెహానా కమల్ పాషా, కళాశాల ప్రిన్సిపాల్, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top