EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

వెలుగుమట్ల అర్బన్ పార్క్ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు

ఖమ్మం, జూలై -18(ఈతరం భారతం)నగరంలోని వెలుగుమట్ల అర్బన్ ఫారెస్ట్ పార్కులో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ లతో కలిసి ప్రారంభోత్సవం, శంఖుస్థాపన లు చేశారు. ఇందులో వాకింగ్ ట్రాకులు, సైక్లింగ్ ట్రాక్, పిల్లల ఆట స్థలాలు, థీమాటిక్ గార్డెన్లు, విశ్రాంతి మండపాలు, చైన్ లింక్ ఫెన్సింగ్, కార్తీక వన భోజనం డైనింగ్ హాల్, పార్క్ సందర్శకుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన భోజన హాల్, కమ్యూనిటీ కిచెన్ సమూహ సమావేశాలు, సామాజిక కార్యక్రమాల కోసం నూతనంగా నిర్మించిన వంటగది, అటవీ మంటలు, ఇతర అవసరాల కోసం వినియోగించేందుకు ట్రాక్టర్ విత్ వాటర్ టాంకర్, బ్యాటరీ ద్వారా నడిచే చెత్త తొలగింపు వాహనం, పార్క్ పరిసరాల్లో పరిశుభ్రత కోసం మున్సిపాలిటీ అందించిన ప్రత్యేక వాహనంలు ఉన్నాయి.ఈ అభివృద్ధి పనులు హరిత నిధి, మున్సిపల్ నిధులతో చేపడుతున్నారు..

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, జీవన ప్రమాణాల మెరుగుదలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఖమ్మం నగరం నగర హరితవనం అభివృద్ధి, పరిశుభ్రతలో ఆదర్శ నగరంగా ఎదుగుతోందన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, నగరాల్లో హరిత వృద్ధి వాతావరణ నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా, ప్రజారోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందన్నారు. ప్రతి మొక్క కూడా భవిష్యత్ తరాలకు ఆశగా నిలుస్తుందన్నారు. ‘ఒక మొక్క అమ్మ పేరు మీద’ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరు తమ తల్లి జ్ఞాపకార్థంగా ఒక మొక్కను నాటాలని, దాన్ని సంరక్షించాలని అన్నారు. వన మహోత్సవం క్రింద నాటిన మొక్కలను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజల చురుకైన భాగస్వామ్యం ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేస్తోందని కలెక్టర్ తెలిపారు.ఈ సందర్భంగా వన మహోత్సవంలో భాగంగా “ఒక మొక్క అమ్మ పేరు మీద” అనే అంశంపై భారీ స్థాయిలో వృక్షార్చన కార్యక్రమం నిర్వహించబడింది. మంత్రి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎఫ్‌ఓ సిద్దార్థ్ విక్రమ్ సింగ్, జిల్లా అధికారులు, ఎఫ్‌డిఓ మంజుల, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, సిబ్బంది పాల్గొన్నారు.


 

Related News

Select the Topic
Scroll to Top