EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి సమీక్ష సమావేశం

ఈతరం భారతం ఖమ్మం జనవరి 7

సమ్మక్క సారక్క జాతరకు సంబంధించిన సమీక్ష సమావేశం ఖమ్మం రీజియన్‌లోని డిపో మేనేజర్లు, ట్రాఫిక్, గ్యారేజ్ సూపర్‌వైజర్లు మరియు డిపో ఎంప్లాయీ వెల్ఫేర్ కమిటీ సభ్యులతో ఖమ్మం రీజనల్ మేనేజర్ శ్రీ ఎ. సరి రాం  అధ్యక్షతన మేడారంలో నిర్వహించారు.భక్తుల సౌకర్యార్థం మేడారంలో ఏర్పాటు చేసిన రవాణా సౌకర్యాలను పరిశీలించిన తర్వాత సమ్మక్క సారలమ్మ అమ్మవారుల దర్శనం చేసుకుని ఈ సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు, అధికారులు తమ అనుభవాలను తెలియజేస్తూ, మేడారం జాతర విజయవంతం కావడానికి అవసరమైన పలు సూచనలు చేశారు.రీజనల్ మేనేజర్ శ్రీ సరి రాం మాట్లాడుతూ, సూపర్‌వైజర్లు, అధికారులు అందరూ సమన్వయంతో కలిసి పనిచేస్తూ కండక్టర్లు, డ్రైవర్లను ప్రయాణికుల పట్ల మర్యాదగా ప్రవర్తించేలా, భక్తుల రవాణా అవసరాలకు అనుగుణంగా బస్సులను ఆపరేట్ చేసేలా ప్రోత్సహించాలని, తద్వారా భక్తులకు మెరుగైన రవాణా సేవలు అందిస్తూ మేడారం జాతర విజయవంతం కావడంలో ప్రతి ఒక్క ఉద్యోగి భాగస్వామ్యం అవ్వాలని కోరారు.

ఈ సమీక్ష సమావేశంలో, డిప్యూటీ రీజినల్ మేనేజర్ V.మల్లయ్య, ఖమ్మం రీజియన్ డిపో మేనేజర్లు, పర్సనల్ ఆఫీసర్ శ్రీ.సంపత్, ట్రాఫిక్ మరియు గ్యారేజీ సూపర్వైజర్లు, సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ అధికారి శ్రీ.కోటాజి మరియు డిపోల నుంచి ఎంప్లాయి వెల్ఫేర్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top