EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

సైబర్ క్రైమ్ అన్లైన్ యాప్ పై పూర్తి అవగాహన ఉండాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఈతరం భారతం డిసెంబర్ 15 ఖమ్మం :

ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, డిజిటల్‌గా అరెస్ట్ చేస్తామని బెదిరించి, డబ్బులు డిమాండ్ చేసే సైబర్ నేరగాళ్ళ మాయమాటలు నమ్మి మోసపోవద్దని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో సైబర్ క్రైమ్ కు సంబంధించి రూపొందించిన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, వ్యక్తిగత సమాచారాన్ని, ముఖ్యంగా పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలు, ఓటిపి లను ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు. అపరిచిత లింక్‌లపై క్లిక్ చేయవద్దని, ఫోన్ ద్వారా వచ్చిన అటాచ్‌మెంట్‌లను తెరవవద్దని సూచించారు. డబ్బును బదిలీ చేయమని, నగదు తీసుకుని ఇవ్వమని కోరే ఎటువంటి అభ్యర్థనలను విశ్వసించవద్దని అన్నారు. ఏదైనా మోసానికి గురైనట్లు భావిస్తే, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, నకిలీ ఖాతాలు, సైబర్ బుల్లీయింగ్, సైబర్ స్టాకింగ్, ఫోటోలు, వీడియోల మార్పు చేయడం, మహిళలు, చిన్నారులపై ఆన్‌లైన్ లైంగిక నేరాలు వంటి అంశాలపై జాగ్రత్తలు పాటించాలన్నారు. వ్యక్తిగత సమాచారాన్ని తెలియని వ్యక్తులతో లేదా అసురక్షిత సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో పంచుకోవద్దని కలెక్టర్ సూచించారు. ఆన్‌లైన్ బెట్టింగ్, నకిలీ ప్రొఫైల్ మోసాలు, డిజిటల్ వేదికల్లో అవగాహన కల్పించాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ, ఏవో కారుమంచి శ్రీనివాసరావు, సైబర్ క్రైమ్ ఏసీపీ ఫణిందర్, సిఐ నరేష్, ఎస్సై విజయ్ కుమార్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top