ఈతరం భారతం ఖమ్మం నవంబర్ 18: రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.
స్వేరోస్ నెట్వర్క్ పునర్నిర్మాణం లో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో బ్యూట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర చీఫ్ కన్వీనర్ దుర్గయ్య , రాష్ట్ర అధ్యక్షులు వీరయ్య , రాష్ట్ర కమిటీ, ఖమ్మం జిల్లా సీనియర్ స్వేరోలు, ఖమ్మం జిల్లా ఇంచార్జి కృష్ణప్రసాద్ సూచనలతో నూతన జిల్లా కమిటీ ఎన్నుకోవడం జరిగింది.జిల్లా అధ్యక్షుడి గా తగరం శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి గా ఇనపనూరి వెంకటేష్, ఉపాధ్యక్షులుగా ఎక్కిరాల చలపతి, ఉమా, కోశాధికారిగా శ్రీశైలం, అధికార ప్రతినిధి గా వెంకట్రావు, జిల్లా కార్యనిర్వాహక సభ్యులుగా స్వర్ణ, రమణయ్య, సుధా, పవిత్ర, వెంకటేష్, గామయ్య, గోపీచంద్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.















