ఈతరం భారతం/మేడారం
వచ్చే సంవత్సరం జనవరి 28 నుండి 31 వరకు జరిగే మేడారం మహా జాతర సందర్భంగా భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సమీక్ష సమావేశాన్ని బుధవారం ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంలో మంత్రులు నిర్వహించనున్నారు.రాష్ట్ర గృహ నిర్మాణం, రెవెన్యూ శాఖ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు హైదరాబాదు నుండి హెలికాక్యాప్టర్లో నేరుగా మేడారం చేరుకోనున్న మంత్రులు అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం పనులను పర్యవేక్షించి సమీక్ష సమావేశంలో పాల్గొంటారు.















