EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన నిర్మలా జగ్గారెడ్డి

సంగా రెడ్డి అక్టోబర్ 8 (ఈతరం భారతం);ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ (ఐ బి) నుండి బసవేశ్వర విగ్రహం వరకు బైపాస్ రోడ్డు పనులను తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పేరిశీలించారు..సంగారెడ్డి పట్టణంలోని బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన జగ్గారెడ్డి గారు రోడ్డు పనులు ఆలస్యం పై అసహనం వెక్తం చేయడం జరిగింది పనుల జాప్యానికి కారణాలను హెచ్ఎండిఏ అధికారులను అడిగి తెలుసుకున్నారు .రోడ్డుకు ఇరువైపులా చెట్లు కరెంటు స్తంభాలు వల్ల రోడ్డు పనులు జాప్యం జరుగుతుంది అన్నారు డిప్యూటీ ఇంజినీర్ ఎలక్ట్రిసిటీ ఫారెస్ట్ అధికారులను స్వయంగా పరిశీలనకు తీసుకెళ్లి తగు సూచనలు చేయడం జరిగింది పనులు వేగంగా చేయాలని ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని తెలిపారు బై పాస్ రోడ్డు లో నాలుగు జంక్షన్ లు ఏర్పాటు చేయాలని సూచించారు అన్ని శాఖల అధికారులు సమన్వయం తో పని చేయాలని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో హెచ్ఎండిఏ ఏఈ వెంకన్న,ఎలక్ట్రిసిటీ ఆడిఈ లక్ష్మన్, ఆర్ అండ్ బి డిఈ రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ డి ఈ రఘు ఫారెస్ట్ అధికారులు, నియోజకవర్గ ఇంచార్జి జూలకంటి ఆంజనేయులు,సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి,నాయకులు తోపాజి అనంత కిషన్,కూన సంతోష్,షఫీ, కిరణ్ గౌడ్, మహేష్, వెంకట్రాజు, ఉదయభాస్కర్,విక్రాంత్ శాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top