ఈతరం భారతం నవంబర్ 24 యాదాద్రి భువనగిరి :
జిల్లా పరిధిలోని ఆలేరు బడిలో కలిసి చదువుకున్న చిన్ననాటి మిత్రులు సుదీర్ఘకాలం తర్వాత కలుసుకున్న అపూర్వ స్నేహ సందర్భం జరిగింది. చిన్నప్పటి మిత్రులంతా కలిసి తమ అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తామంతా ఒక సంఘంగా ఏర్పడి తమలో ఒకడైన మిత్రుడు జనగాం సిద్ధులు గౌడ్ ను అధ్యక్షునిగా, మంగళపల్లి వెంకటేశ్వర్లను ఉపాధ్యక్షులుగా నియమించి వారిని సత్కరించి ఆనందించారు. కార్యక్రమంలో పెండెం శ్రీనివాస్, గణేష్, కిషన్, మనోహర్ పాల్గొన్నారు.















