EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఐ వి ఎఫ్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలు పంపిణీ చేసిన యాదాద్రి కలెక్టర్ హనుమంతరావు 

ఈతరం భారతం ఆగస్టు 25  యాదాద్రి భువనగిరి : ఐవిఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో యాదగిరి గుట్ట భువనగిరి కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ సోమవారం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొని మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ వంగపల్లి అంజయ్య స్వామి ,కుక్కుటపు చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ మట్టి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసి కాలుష్య రహిత జిల్లాగా ఉంచాలని ప్రజలందరినీ కోరారు, ఇంటర్నేషనల్ రేషన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు, ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ పట్టణ అధ్యక్షుడు కార్యదర్శి బిజ్జాల శ్రీనివాస్ ట్రెజరర్ జంగాల హనుమంత్ యాదగిరిగుట్ట పట్టణ అధ్యక్షుడు లెంకల పల్లి శ్రీనివాస్,ఐ వి ఎఫ్ నాయకుడు బెజ్జాల విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top