EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

భక్తిశ్రద్ధలతో ముక్కోటి ఏకాదశి

ఈతరం భారతం డిసెంబర్ 30యాదాద్రి భువనగిరి :

జిల్లా పరిధిలోని భువనగిరి,ఆలేరు నియోజకవర్గాల వ్యాప్తంగా పలు వైష్ణవాలయాలలో ముక్కోటి ఏకాదశి పండుగను మంగళవారం ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం 5 గంటల నుండి ప్రజలు ఆలయాలకు భారీ సంఖ్యలో చేరుకొని ఉత్తర ద్వారం ద్వారా స్వామివార్ల, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. దైవనామ స్మరణతో ఆలయాలన్నీ పండుగ శోభతో శోభిల్లాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ ప్రాంగణాలలో ఉత్సవమూర్తులకు జరిగిన విశేష పూజలలో, ధనుర్మాస పాశురాల పఠనం లో మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top