EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మాజీ రెవెన్యూ ఉద్యోగి ఉప్పలయ్య మృతి 

ఈతరం భారతం నవంబర్ 29 యాదాద్రి భువనగిరి :

జిల్లా పరిధిలోని ఆలేరు తహసీల్దార్ కార్యాలయంలో 1986 నుండి 2021 వరకు సుదీర్ఘకాలం వీఆర్ఏ మస్కూరిగా సేవలందించి గుర్తింపు పొందిన కొత్త ఉప్పలయ్య మృతి చెందారు. ఆలేరులో దాదాపు 20 మంది తహసీల్దారుల వద్ద ఆయన ఉద్యోగిగా సేవలందించారు. శనివారం పోచమ్మ వాడలోని ఆయన ఇంటికి వెళ్లి నలుగురు మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఉప్పలయ్య మృతి పట్ల పలువురు అధికారులు, నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రజలు సంతాపం వ్యక్తం చేశారు. ఉప్పలయ్య ఆలేరు ప్రాంతానికి అందించిన సేవలను వారు కొనియాడారు.

Related News

Select the Topic
Scroll to Top